Minister Harish Rao : కాంగ్రెస్ పార్టీ గోబెల్స్ ప్రచారం చేస్తోంది.. వాటిని తిప్పికొట్టాలి
. 2009 మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఒక్కటి అమలు చెయ్యలేదు. ప్రత్యేక తెలంగాణ తరువాత అధికారంలోకి వచ్చిన మనం.. తండాలను పంచాయతీలుగా చేసినాం. పొడు భూముల సమస్యలు పరిష్కారం చేస్తున్నాం. అన్ని వర్గాల ప్రజలకు లబ్ధిచేకూరేలా పథకాలు అమలు చేస్తున్నాం..

Harish Rao
TS Assembly Elections 2023: కాంగ్రెస్ పార్టీ గోబెల్ ప్రచారం చేస్తోంది.. వాటిని బీఆర్ఎస్ కార్యకర్తలు ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని మంత్రి హరీష్ రావు సూచించారు. ఆదివారం బీఆర్ఎస్ పార్టీ నాయకుల సమావేశంలో మంత్రి హరీష్ రావు పాల్గొని మాట్లాడారు.. మూడోసారీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి రాబోతున్నాడు. అన్ని సర్వేలు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. మనం సీరియస్ గా నెల రోజులు కష్టపడాలి. ఒక ప్లాన్ ప్రకారం ముందుకెళ్లాలని పార్టీ నాయకులకు హరీష్ రావు సూచించారు. 2009 మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఒక్కటి అమలు చెయ్యలేదు. ప్రత్యేక తెలంగాణ తరువాత అధికారంలోకి వచ్చిన మనం.. తండాలను పంచాయతీలుగా చేసినాం. పొడు భూముల సమస్యలు పరిష్కారం చేస్తున్నాం. అన్ని వర్గాల ప్రజలకు లబ్ధిచేకూరేలా పథకాలు అమలు చేస్తున్నాం.. నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పథకాల గురించి ప్రజలకు తెలియపర్చాలని హరీష్ రావు సూచించారు.
ప్రతిరోజూ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించాలి. సోషల్ మీడియా ద్వారా, పేపేర్ల ద్వారా, ప్రతి ఇంటికి స్టికర్లు అతికించాలి. డోర్ టూ డోర్ ఈ కార్యక్రమం జరగాలని పార్టీ శ్రేణులకు హరీష్ రావు సూచించారు. ప్రతిరోజూ మ్యానిఫెస్టో అంశంపై, మ్యానిఫెస్టోలో పొందుపర్చిన అంశాలు మీడియాతో ఒకరు మాట్లాడాలి, అవసరం అయితే యాడ్స్ ఇవ్వడం ద్వారా ప్రచారం చేయాలని హరీష్ రావు సూచించారు. సీఎం సభ జరిగే ప్రదేశాల్లో మ్యానిఫెస్టో అంశాలు ఫ్లెక్సీలు ఏర్పాటు చెయ్యాలని సూచించారు.
కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో మీదా మైండ్ గేమ్ ఆడుతుంది. వారి గ్లోబల్ ప్రచారాన్ని తిప్పికొట్టి బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ప్రజలకూ తెలియపర్చాలని హరీష్ రావు సూచించారు. కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్న రాష్ట్రాల్లో కరెంట్ కోతలు ఎలా ఉన్నాయో, మన తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ నాణ్యమైన సరఫరా ఎలా ఉందో ప్రజలకు తెలియపర్చాలని హరీష్ రావు బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు.