Minister Harish Rao : ఎవరైనా బీజేపీలో చేరితే అది ఆత్మహత్యా సదృశ్యమే : మంత్రి హరీష్ రావు
బీజేపీపై మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఖమ్మంలో బీజేపీకి స్థానం లేదని స్పష్టం చేశారు. ఎవరైనా బీజేపీలో చేరితే అది ఆత్మహత్య సదృశ్యమే అవుతుందని అభివర్ణించారు.

Harish Rao
Minister Harish Rao : మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. బీజేపీపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఖమ్మంలో బీజేపీకి స్థానం లేదని స్పష్టం చేశారు. ఎవరైనా బీజేపీలో చేరితే అది ఆత్మహత్య సదృశ్యమే అవుతుందని అభివర్ణించారు. ఎల్లుండి ఖమ్మంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. ఇవాళ బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది.
మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీలో చేరడమంటే తమ గొయ్యి తాము తొవ్వుకోవడమేనని అన్నారు. ఖమ్మంలో బీజేపీ మొలకెత్తదని తేల్చి చెప్పారు. ఖమ్మం పోరాటాల గడ్డని.. ఇక్కడ ఎర్ర జెండాలు పాలించాయని అని చెప్పారు. ఇక్కడ మతతత్వ పార్టీలు మనుగడ సాగించలేవని హరీష్ రావు పేర్కొన్నారు.
Harish Rao: ఆర్మీని ప్రైవేటు పరం చేసే కుట్ర: మంత్రి హరీష్ రావు
ఖమ్మంలో 10 ఎమ్మెల్యే స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉండే ప్రశ్నే లేదనిఅది రోజు రోజుకు డౌన్ అయిపోతుందని విమర్శించారు. ఖమ్మం ప్రజలు అభివృద్ధికి పట్టం కడతారని తెలిపారు. ఈ జిల్లా ధర్మం వైపు, న్యాయం వైపు నిలబడుతుందని స్పష్టం చేశారు.