Minister Harish Rao : నడ్డాలు, పాండేలు యూపీనుంచి వచ్చి మాకు నీతులు చెప్పక్కర్లా తెలంగాణా నుంచి మీరే నేర్చుకుని వెళ్లండీ : మంత్రి హరీశ్ రావు

నడ్డాలు, పాండేలు వస్తారు..ఏమోమో మాట్లాడతారు..ఎన్నికలు వస్తున్నాయంటే చాలు కొంతమంది టూరిస్టులో తెలంగాణలో దిగుతారు.యూపీ నుంచి వచ్చి ఏమేమో పనికిమాలిన మాటలు మాట్లాడతారు.

Minister Harish Rao : నడ్డాలు, పాండేలు యూపీనుంచి వచ్చి మాకు నీతులు చెప్పక్కర్లా తెలంగాణా నుంచి మీరే నేర్చుకుని వెళ్లండీ  : మంత్రి హరీశ్ రావు

minister harish rao

Updated On : June 24, 2023 / 5:40 PM IST

Minister Harish Rao : కేంద్ర ప్రభుత్వం, బీజేపీపైనా తెలంగాణ మంత్రి హరీశ్ రావు మరోసారి సెటైర్లు వేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించనున్నారు. నడ్డా తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 25న నడ్డా నాగర్ కర్నూల్ కు రానున్నారు. 25వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు నడ్డా చేరుకుంటారు. జేపీ నడ్డా తెలంగాణ టూర్ పై మంత్రి హరీవ్ రావు సెటైర్లు వేశారు.

JP Nadda : జేపీ నడ్డా తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారు.. ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులతో భేటీ

‘‘నడ్డాలు, పాండేలు వస్తారు..ఏమోమో మాట్లాడతారు..ఎన్నికలు వస్తున్నాయంటే చాలు కొంతమంది టూరిస్టులో తెలంగాణలో దిగుతారు.యూపీ నుంచి వచ్చి ఏమేమో పనికిమాలిన మాటలు మాట్లాడతారు’’అంటూ మండిపడ్డారు. ఆరోగ్య రంగంలో తెలంగాణ మూడవ స్థానంలో ఉంది కానీ రాజస్థాన్ 16వస్థానంలో ఉంది ఈ విషయం గుర్తు పెట్టుకోండి అన్నారు.

‘‘యూపీ నుంచి ఎవరెవరో వచ్చి మాకు నీతులు చెబుతారు..మీరు మాకు నీతులు చెప్పక్కర్లా..తెలంగాణ నుంచి మీరే నేర్చుకుని వెళ్లండి’’అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ అన్ని రంగాల్లో మెరుగ్గా ఉంది .. మీరు అన్నింట్లోను అథమస్తానంలో ఉన్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. కరోనా కంటే దాని తాతలాంటి వైరస్సు వచ్చినా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాం..దానికి తగినట్లుగా తెలంగాణలో ఆరోగ్యం రంగం భేషుగ్గా ఉంది అన్నారు.

Revanth Reddy : అధికారంలోకి రాగానే.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ఇస్తాం- రేవంత్ రెడ్డి