Komatireddy Venkat Reddy : అందుకే.. ఏపీలో మళ్లీ జగన్ గెలవాలని కేసీఆర్ కోరుకుంటున్నారు- మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

కవిత ముత్యమో, బంగారమో, వజ్రమో ఏదైనా మంచిదే ఇక ఆమెని ఇంట్లో పెట్టుకోండి. కవిత వల్ల తెలంగాణ తల దించుకుంది.

Komatireddy Venkat Reddy : అందుకే.. ఏపీలో మళ్లీ జగన్ గెలవాలని కేసీఆర్ కోరుకుంటున్నారు- మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Komatireddy Venkat Reddy

తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి కేసీఆర్ టార్గెట్ గా నిప్పులు చెరిగారు. కేసీఆర్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. ఏపీలో జగన్ గెలిస్తే మళ్లీ కొన్ని డబ్బులు ఇస్తాడని కేసీఆర్ అనుకుంటన్నారని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ఏపీలో జరిగే ఎన్నికల్లో మళ్లీ జగనే గెలుస్తాడనే సమాచారం ఉందని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి ఇలా కౌంటర్ ఇచ్చారు.

”కేసీఆర్ కి నాలెడ్జ్ ఉందని అనుకున్నా. కానీ, ఆయనకు ఏమీ తెలియదు. ఎన్నికల సమయంలో కేసీఆర్ పని లేక నాలుగు గంటలు మీడియాతో మాట్లాడారు. మరోసారి నా పేరు తీయకు. బిడ్డ జైల్లో ఉంటే ఎవరికైనా మెంటల్ గా బ్యాలెన్స్ తప్పుతుంది. కవిత ఫ్రీడమ్ ఫైటర్ లాగా జైలు నుండి బయటకి వచ్చేప్పుడు చేయి ఊపుతుంది. నేను నిజమైన దీక్ష చేశాను. కేసీఆర్ లా దొంగ దీక్ష చేయలేదు. కేసీఆర్ దీక్ష చేసినప్పటి వివరాలన్నీ నా దగ్గర ఉన్నాయి. కేసీఆర్ హయాంలో లాగ్ బుక్స్ ఎందుకు ప్రగతి భవన్ కి తెప్పించుకున్నారు?

పదేళ్లు మంత్రిగా పని చేసినా చేతగాని మంత్రి 3వేల మెజారిటీతో గెలిచాడు. కేసీఆర్ వచ్చాక మా జిల్లాలో ఫ్లోరైడ్ పెరిగింది. కేసీఆర్ కి ఒక్క సీటు కూడా రాదు. మెదక్ లో కేసీఆర్ కి డిపాజిట్ రావచ్చు. జనాలు రాలేదని రోడ్లపై గంటలకు గంటలు వెయిట్ చేశారు కేసీఆర్. 2వేల మందితో బహిరంగ సభ నిర్వహించారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్.

కేసీఆర్ తెలంగాణ పరువు తీశారు. కవిత ముత్యమో, బంగారమో, వజ్రమో ఏదైనా మంచిదే ఇక ఆమెని ఇంట్లో పెట్టుకోండి. కవిత వల్ల తెలంగాణ తల దించుకుంది. కేసీఆర్ తన బిడ్డలనైనా మంచి మార్గంలో నడిపించే ప్రయత్నం చేయాలి. కేసీఆర్ గెలిస్తే పోలవరం దగ్గర మూడు లిఫ్టులు పెట్టేవారు. ఆగస్ట్ 15లోపు రుణమాఫీ చేస్తాం. దొంగతనం చేశాక ఎమ్మెల్సీ అయితే ఏంటి? సీఎం అయితే ఏంటి? కేసీఆర్.. పొలం బాట నాటకాలు బంద్ చేయ్” అని విరుచుకుపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

బీఆర్ఎస్ కు 2 సీట్లు వస్తే రాజీనామా చేస్తా- మంత్రి కోమటిరెడ్డి సవాల్
అంతేకాదు.. బీఆర్ఎస్ పార్టీకి మంత్రి కోమటిరెడ్డి సవాల్ కూడా విసిరారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ రెండు సీట్లు గెలిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. నల్గొండలో బీజేపీ, బీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా రావని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్రానికి, జిల్లాకు ఏమీ చేయని బీజేపీకి.. ఓటు అడిగే హక్కే లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి.

Also Read : బరిలో సీనియర్లు.. నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ఎవరి బలం ఎంత?