మా ఆధిపత్యాన్ని దెబ్బతీయాలని కొంత మంది రెడ్లు లాబీయింగ్ చేస్తున్నారు: కొండా సురేఖ మరో సంచలనం

"నేను ఏది ఉన్నా పార్టీ అధిష్ఠానానికే నేరుగా చెప్పి రాజకీయాలు చేస్తాను" అని కొండా సురేఖ అన్నారు.

మా ఆధిపత్యాన్ని దెబ్బతీయాలని కొంత మంది రెడ్లు లాబీయింగ్ చేస్తున్నారు: కొండా సురేఖ మరో సంచలనం

Konda Surekha

Updated On : October 14, 2025 / 3:56 PM IST

Konda Surekha: మేడారం టెండర్ల విషయంలో తనకు భిన్నాభిప్రాయాలు లేవని తెలంగాణ మంత్రి కొండా సురేఖ అన్నారు. హనుమకొండ జిల్లాలో మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్న ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

“మంత్రిగా నా శాఖ పనులు పారదర్శకంగా ఉండాలనేదే నా కోరిక. మూడు ప్రధాన కంపెనీలు టెండర్లు వేశాయి. అందులో ఎవరి ఎలిజిబిలిటీ వారిది. మంత్రిగా నాకు, నా శాఖ కార్యదర్శికి ప్రతి విషయం నోటీసులో ఉండాలనేదే నా ఉద్దేశం.

పనులు వేగంగా జరగాలన్నదే మంత్రిగా నా ఆలోచన, సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన. సీఎం మేడారం పనులపై మంత్రి పొంగులేటిని ఫోకస్ చేయమన్నారు. ప్రతి విషయం ఓపెన్ గా మాట్లాడటం నాకు అలవాటు. ఏదీ దాచి పెట్టలేను. నటుడు నాగార్జున విషయంలో నేను మాట్లాడింది వేరు.. దాన్ని వివాదంగా చిత్రీకరించిన తీరు వేరు.

దానితో నేను మనస్తాపం చెందాను. అందుకే మీడియాతో ఓపెన్ గా ఉండటం లేదు. మా ఆధిపత్యాన్ని దెబ్బతీయాలని కొంత మంది రెడ్లు లాబీయింగ్ చేస్తున్నారు. ఏది ఉన్నా పార్టీ అధిష్ఠానానికే నేరుగా చెప్పి రాజకీయాలు చేస్తాను.

ఎవరినో ఏదో చేయడానికి ఢిల్లీ, హైదరాబాద్‌లో ప్రత్యేక లాబీయింగ్ లేదు.. ఆ అవసరం అంతకన్నా లేదు. మంత్రిగా నేను ఏ పని చేసినా వివాదం చేయాలనుకుంటున్నారు. అందుకే మౌనంగా నా శాఖ పనులు నేను చేయాలనుకుంటున్నాను. ఎవరు ఏం అనుకున్నా క్యాబినెట్ మంత్రిగా నా బాధ్యతలు నాకు తెలుసు” అని తెలిపారు.