KTR : టాటాలే కాదు తాతల నాటి కులవృత్తులూ బాగుపడాలి, గౌడ కుల సంఘ భవనానికి రూ.2కోట్లు- మంత్రి కేటీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం అదే మాదిరి పోరాటం చేసి గోల్కొండ కోటపై జాతీయ జెండా ఎగురవేశారని కేటీఆర్ వ్యాఖ్యానించారు KTR - Gowda Caste

KTR : టాటాలే కాదు తాతల నాటి కులవృత్తులూ బాగుపడాలి, గౌడ కుల సంఘ భవనానికి రూ.2కోట్లు- మంత్రి కేటీఆర్

KTR - Gowda Caste (Photo : Twitter)

Updated On : August 18, 2023 / 7:16 PM IST

KTR – Gowda Caste : రాజన్న సిరిసిల్ల జిల్లా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఒక కులానికో, మతానికి సంబంధించిన వారు కాదన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆత్మగౌరవ పోరాటం చేశారని చెప్పారు. పాపన్న గౌడ్.. 10 మందితో పోరాటాన్ని ప్రారంభించి గోల్కొండ కోటపై జెండా ఎగురవేశారని అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం అదే మాదిరి పోరాటం చేసి గోల్కొండ కోటపై జాతీయ జెండా ఎగురవేశారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. గౌడ కుల సంఘ భవనానికి రెండు ఎకరాల స్థలంతో పాటు భవన నిర్మాణానికి రూ.2 కోట్లు ఇప్పుడే మంజూరు చేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు.

Also Read..Sanathnagar Constituency: టీడీపీ చీల్చే ఓట్లపైనే గెలుపు అవకాశాలు.. సనత్‌నగర్‌లో ఈసారి కనిపించబోయే సీనేంటి?

”సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోంది. కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్నాo. సిరిసిల్ల గౌడన్నలకు తెలంగాణలో మొదటిసారిగా సేఫ్టీ మోకులు అందజేస్తాం. కోనసీమ, పాపికొండలను మించి సిరిసిల్ల తయారైందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెబితే సంతోషం అనిపించింది. కరెంట్, సాగు, తాగు నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపాం.

టాటాలే కాదు.. తాతల నాటి కులవృత్తులు కూడా బాగుపడాలి. అన్ని వర్గాలు, కులాలు బాగుపడాలి. వెయ్యి గురుకులాలు జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ అయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నీరా కేఫ్ ఏర్పాటు చేస్తాం. మల్కపేట జలాశయంను వచ్చే నెలలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తాం. మల్కపేట జలాశయం నుంచి సింగం సముద్రం, అక్కడ నుంచి బట్టల చెరువు మీదుగా నర్మల డ్యాంను నింపుతాం. ఇప్పటికే నర్మల డ్యాంను మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ద్వారా నింపుతున్నాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ మానేరులో 365 రోజులు నీరు పారనుంది” అని కేటీఆర్ చెప్పారు.