Minister Ktr : వీఎస్టీ-ఇందిరా పార్క్ స్టీల్ బ్రిడ్స్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ .. నాయిని నర్శింహారెడ్డి బ్రిడ్జ్‌గా నామకరణం

ఇందిరా పార్క్ నుంచి వీఎస్టీ వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 2.62 కిలోమీటర్ల పొడవుగల ఈ బ్రిడ్జ్ కు మాజీ మంత్రి నాయిని నర్శింహారావు పేరును పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం.

Minister Ktr : వీఎస్టీ-ఇందిరా పార్క్ స్టీల్ బ్రిడ్స్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ .. నాయిని నర్శింహారెడ్డి బ్రిడ్జ్‌గా నామకరణం

Minister Ktr Inauguration Of Steel Bridge Flyover

Updated On : August 19, 2023 / 2:48 PM IST

Indira Park to VST Of Steel Bridge : హైదరాబాద్ నగరంలో ఎన్నో ఫ్లైఓవర్ల నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతున్నాయి. పెరుగుతున్న నగర జనాభాతో రద్దీ ప్రాంతాల్లో ఫ్లైఓవర్ల నిర్మాణాలు అందుబాటులోకి రావటంతో ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెడుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ కు తలమానికంగా  మరో స్టీల్ బ్రిడ్జ్ అందుబాటులోకి వచ్చింది. ఇందిరాపార్క్- వీఎస్టీ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కావటంతో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ బ్రిడ్జ్ నిర్మాణం ప్రారంభమైంది. ఇందిరా పార్క్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్ మీదుగా వీఎస్టీ జంక్షన్ వరకు నిర్మించి అతి పొడవైన స్టీల్ బ్రిడ్జ్ నిర్మించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. 2.62 కిలోమీటర్ల పొడవుగల ఈ బ్రిడ్జ్ కు మాజీ మంత్రి నాయిని నర్శింహారావు పేరును పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం.

రూ.450 కోట్లతో వ్యయంతో నిర్మించబడిన ఈ బ్రిడ్జ్ ను మంత్రి కేటీఆర్ ఈరోజు ప్రారంభించారు. ఈ స్టీల్ బ్రిడ్జ్ వల్ల ఇందిరా పార్క్ నుంచి వీఎస్డీ వరకు ట్రాఫిక్ జామ్ తగ్గునుంది. ఇందిరా పార్క్ నుంచి వీఎస్టీ వరకు వెళ్లాంటే గతంలో దాదాపు 30 నిమిషాలు పట్టేది. కానీ ఈ బ్రిడ్జి నిర్మాణం అందుబాటులోకి రావటంతో ఈ ప్రయాణం కేవలం ఐదు నిమిషాల్లోనే పూర్తి అవుతుంది.

Malkajgiri: మల్కాజ్‌గిరి సీటుపై బీజేపీ కీలక నేతల ఫోకస్.. టిక్కెట్ రేసులో ఆ నలుగురు!

తెలంగాణ ఏర్పాడ్డాక రాష్ట్ర తొలి హోంమంత్రిగా, ముషీరాబాద్ ఎమ్మెల్యేగా, వీఎస్టీ వర్కర్స్ యూనియన్ నేతగా సేవలందించారు. దీంతో నాయిని నర్శింహారావు పేరును వీఎస్టీ స్టీల్ బ్రిడ్జ్ కు పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించటంతో అదే పేరును ఖరారు చేసి నాయిని నర్శింహారావు బ్రిడ్జిగా నామకరణం చేశారు.

2.6 కిలోమీటర్ల పొడవున్న ఈ స్టీల్ బ్రిడ్జ్ లో మొత్తం 81 స్టీల్ పిల్లర్లు, 46 పైల్ ఫౌండేషన్లు ఉన్నాయి. నాలుగు లేన్లుగా నిర్మించిన దీంట్లో 426 గర్డర్లు ఉన్నాయి. ఈ వంతెన నిర్మాణం పూర్తి కావటంతో ఇక ఇందిరాపార్క్, ఎన్టీఆర్ స్టేడియం, అశోక్ నగర్, మూవీ థియేటర్ జంక్షన్ ఆర్టీసీ క్రాస్ రోడ్, బస్ భవన్, వీఎస్టీ వరకుండే ట్రాఫిక్ జామ్ సమస్య తీరిపోనుంది.