KTR ORR : జిగేల్..జిగేల్.. ఔటర్ రింగ్ రోడ్డులో ఎల్ఈడీ లైట్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులో ఎల్ఈడీ లైట్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఓఆర్ఆర్ పై 136 కిలోమీటర్ల మేర ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు..

KTR ORR : జిగేల్..జిగేల్.. ఔటర్ రింగ్ రోడ్డులో ఎల్ఈడీ లైట్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Ktr Orr

Updated On : December 16, 2021 / 9:42 PM IST

KTR ORR : హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులో ఎల్ఈడీ లైట్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. హెచ్ఎండీఏ, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఓఆర్ఆర్ పై 136 కిలోమీటర్ల మేర ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. నాలుగు ప్యాకేజీల్లో 100.22 కోట్లతో ఏడేళ్ల వరకు ఆపరేషన్, మెయింటెనెన్స్ ఉంటుంది. జంక్షన్, అండర్ పాస్, రెండు వైపులున్న సర్వీస్ రోడ్లను ఒక కిలోమీటర్ మేర ఈ లైట్లు ఏర్పాటు చేశారు.

వీటి ఏర్పాటుతో ప్రమాదాలను తగ్గించొచ్చని అధికారులు అంటున్నారు. 6వేల 340 పోల్స్ కు 13వేల 392 ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ మధ్య 22 కిలోమీటర్ల మేర రూ.30 కోట్లతో 2018లోనే లైటింగ్ ను ఏర్పాటు చేశారు. దీంతో 158 కిలోమీటర్ల మేర విద్యుత్ కాంతులతో వెలిగిపోతోంది ఓఆర్ఆర్.

WhatsApp Group Admins : వాట్సాప్ గ్రూపు అడ్మిన్లకు న్యూ పవర్..? అందరి మెసేజ్‌లు డిలీట్ చేయొచ్చు!

ఔటర్‌పై ఎల్‌ఈడీ లైట్లను పూర్తిగా గ్లోబల్‌ సిస్టమ్‌ మొబైల్‌ (జీఎస్ఎం) బేస్డ్‌ ఆటోమేషన్‌ రిమోట్‌ విధానంలో ఏర్పాటు చేశారు. ఈ బల్బులతో విద్యుత్‌ ఆదాతో పాటు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ప్రతీ 12 మీటర్లకు స్తంభం చొప్పున 136 కిలోమీటర్ల మార్గంలో 6వేల 340 స్తంభాలను ఏర్పాటు చేశారు.

13వేల 392 ఎల్‌ఈడీ బల్బులను అమర్చారు. ఔటర్‌ అప్‌ అండ్‌ డౌన్‌ ర్యాంప్‌లు, పలు జాతీయ, రాష్ట్రీయ రహదారుల అనుసంధానమైన ప్రాంతాల్లో కూడా ఎల్‌ఈడీ బల్బులు అమర్చారు. ఇంటర్‌ఛేంజ్‌లు, అండర్‌పాస్‌లలోనూ వీటిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.

Exercises : కాళ్లల్లో పేరుకుపోయిన కొవ్వు కరిగించే వ్యాయామాలు ఇవే…