Minister KTR : ఖమ్మం టీఆర్ఎస్ కార్పొరేటర్లకు మంత్రి కేటీఆర్ క్లాస్

వార్డుల్లో ఇంటింటికి తిరిగి..ప్రజల సమస్యలు తెలుసుకోవాలన్నారు. పట్టణ ప్రగతిలో అన్ని సమస్యలు పరిష్కరించాలని కార్పొరేటర్లకు సూచించారు.

Minister KTR : ఖమ్మం టీఆర్ఎస్ కార్పొరేటర్లకు మంత్రి కేటీఆర్ క్లాస్

Ktr Class

Updated On : June 11, 2022 / 5:04 PM IST

Minister KTR : ఖమ్మం టీఆర్ఎస్ కార్పొరేటర్లపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరి పనితీరు సరిగా లేదన్నారు. ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే కుదరదని హెచ్చరించారు. ప్రజల మధ్యే ఉండాలని కార్పొరేటర్లకు సూచించారు. వార్డుల్లో ఇంటింటికి తిరిగి..ప్రజల సమస్యలు తెలుసుకోవాలన్నారు. పట్టణ ప్రగతిలో అన్ని సమస్యలు పరిష్కరించాలని కార్పొరేటర్లకు సూచించారు.

ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఆ తర్వాత ఖమ్మం నూతన మున్సిపల్ కార్యాలయంలో టీఆర్ఎస్ కార్పొరేటర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలోనే కార్పొరేటర్లకు మంత్రి కేటీఆర్ క్లాస్ పీకారు.
Minister KTR : రాహుల్, బండి సంజయ్ పై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ కాసేపు సరదాగా గడిపారు. మంత్రి పువ్వాడ అజయ్‌తో కలిసి వాలీబాల్ ఆడారు. ఖమ్మం మున్సిపల్ నూతన కార్పొరేషన్‌ భవనాన్ని ప్రారంభించిన తర్వాత క్రీడా ప్రాంగణానికి శంకుస్థాపన చేశారు. ఆ సమయంలో మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ సరదాగా వాలీబాల్‌ ఆడారు.