Miss World 2025: మిస్ వరల్డ్‌ను ఎలా సెలెక్ట్ చేస్తారు.. అందం, కొలతలేనా? ఏమేం టెస్టులు పెడతారు?
ఈ దశలన్నీ దాటిన వారు మిస్ వరల్డ్ ఫైనల్స్ లో ఉంటారు. ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తారు. జడ్జీలు అడిగే ప్రశ్నలకు అందగత్తెలు ఎలాంటి సమాధానం చెబుతారో..

Miss World 2025: ప్రపంచ సుందరి పోటీలకు హైదరాబాద్ వేదికైంది. 108 దేశాల నుంచి అందగత్తెలు మిస్ వరల్డ్ 2025 పోటీలో ఉన్నారు. ఇండియా నుంచి నందిని గుప్తా రేసులో ఉన్నారు. ఈ రాత్రికి మిస్ వరల్డ్ విజేత ఎవరో ప్రకటించబోతున్నారు నిర్వహాకులు. అసలు మిస్ వరల్డ్ ఎంపిక ఎలా ఉంటుంది? ఎవరు డిసైడ్ చేస్తారు? అందాల పోటీలో ఉండే అర్హతలు ఏంటి? పోటీల నిర్వహణ ఎలా ఉంటుంది? ఈ అంశాలపై ప్రజల్లో అనేక ప్రశ్నలు, సందేహాలు ఉన్నాయి.
1951లో ప్రారంభమైన మిస్ వరల్డ్ పోటీలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. లండన్ కు చెందిన మిస్ వరల్డ్ సంస్థ ఈ పోటీలు నిర్వహిస్తోంది. మిస్ వరల్డ్ సంస్థకు ప్రస్తుతం 85 ఏళ్ల జూలియా మూర్లే నిర్వహాకురాలిగా ఉన్నారు. ఈ సంస్థను ఆమె భర్త ప్రారంభించగా ఆయన మరణం తర్వాత జూలియా, ఆమె కుమారుడు కలిసి నిర్వహిస్తున్నారు. మిస్ యూనివర్స్, మిస్ ఎర్త్, మిస్ ఇంటర్నేషనల్ తరహా పోటీలు నిర్వహించే సంస్థల్లో కెల్లా ఇదే పాతది. ఈ ఏడాది హైదరాబాద్ లో నిర్వహిస్తున్న పోటీలకు 108 దేశాల నుంచి అందగత్తెలు వచ్చారు.
విజేత ఎంపిక విధానం ఇలా..
ఇక మొదట ఖండాల వారీగా కూడా విజేతలను నిర్ణయిస్తారు. ప్రపంచంలోని ఏడు ఖండాలను ఆఫ్రికా, అమెరికాస్ అండ్ కరేబియన్, ఆసియా అండి ఓషినియా, యూరప్ అనే నాలుగు క్యాటగిరీలుగా మిస్ వరల్డ్ సంస్థ విభజించుకుంది. ఈ నాలుగు ఖండాల నుంచి ఒక్కో ఖండానికి 10 మంది చొప్పున టాప్ 40లోకి అందగత్తెలను ఎంపిక చేస్తారు. వారిలో నుంచి ఖండానికి ఐదుగురు చొప్పున టాప్ 20మందిని నిర్ణయిస్తారు. అనంతరం ఖండానికి ఇద్దరు చొప్పున టాప్ 8 కి చేరుకుంటారు. ఈ 8మందిలో నలుగురు ఫైనల్ కు చేరుతారు. ఆ నలుగురిలో ఒకరు మిస్ వరల్డ్ అవుతారు. మిగతా అందగత్తెల్లో ఆయా ఖండాల వారీగా విజేతలుగా మొదటి, రెండు, మూడు రన్నరప్ లుగా ఉంటారు.
అందాల పోటీలో ఉండే అర్హతలు ఏంటి?
అందంతోనే మిస్ వరల్డ్ అవార్డుకు ఎంపిక చేస్తారంటే పెద్ద పొరపాటే. శరీర కొలతలు లెక్క ప్రకారం ఉన్నవారే ఎంపిక అవుతారంటే అదీ పొరపాటే అవుతుంది. కేవలం అందం, శరీర కొలతలు మాత్రమే కాకుండా మిస్ వరల్డ్ ఎంపికలో అనేక పోటీలు ఉంటాయి. స్పోర్ట్స్ చాలెంజ్ పేరుతో మొదట పోటీలు నిర్వహిస్తారు. టాలెంట్ చాలెంజ్ లో వారు సంగీతం, కళలు, నృత్యం వంటి పోటీల్లో తమ ప్రతిభ చూపిస్తారు. హెడ్ టు హెడ్ చాలెంజ్ లో భాగంగా వారి మేధస్సు, కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటివి చూస్తారు.
ఇవి కాక టాప్ మోడల్ చాలెంజ్ అని ఉంటుంది. అందులో ఫ్యాషన్ షో నిర్వహిస్తారు. అందులో డిజైనర్ డ్రెస్ విభాగం కూడా ఉంటుంది. సామాజిక సేవకు సంబంధించిన బ్యూటీ విత్ ఏ పర్పస్ అనే విభాగం ఉంటుంది. ఇటీవల మల్టీ మీడియా విభాగం కూడా చేర్చారు. అందులో సోషల్ మీడియాలో వారిచ్చే సందేశాలు వంటి వాటిని పరిశీలిస్తారు.
Also Read: వావ్.. వాట్సాప్ స్టేటస్‌లో ఇన్‌స్టాగ్రామ్ రేంజ్ కొత్త ఫీచర్లు.. భలే ఉన్నాయిగా.. ఓసారి లుక్కేయండి..!
ఈ దశలన్నీ దాటిన వారు మిస్ వరల్డ్ ఫైనల్స్ లో ఉంటారు. ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తారు. జడ్జీలు అడిగే ప్రశ్నలకు అందగత్తెలు ఎలాంటి సమాధానం చెబుతారో పరిశీలించి మిస్ వరల్డ్ ను ప్రకటిస్తారు. కొన్ని అందాల పోటీల్లో స్విమ్ సూట్ రౌండ్ ఉంటుంది. కాంపిటీటర్స్ అంతా స్విమ్ సూట్ మాత్రమే వేసుకుని కనిపిస్తారు. అయితే 2014 నుంచి మిస్ వరల్డ్ పోటీల్లో ఆ రౌండ్ తీసేశారు.
కొంతమంది అనుకుంటున్నట్లు మిస్ వరల్డ్ ఎంపికలో కేవలం కొలతలకే ప్రాధాన్యత ఉండదని అంటున్నారు నిర్వాహాకులు. ఒకప్పుడు శరీర కొలతలకే ప్రాధాన్యత ఉండేదని.. ఇప్పుడు అలా కాదంటున్నారు ఆర్గనైజర్స్. బ్యూటీ విత్ ఏ పర్సన్ తో విన్నర్ ను డిక్లేర్ చేస్తామంటున్నారు. నలుపు తెలుపు అని కాకుండా అందగత్తెల వ్యక్తిత్వం, మానవత్వం, కరుణ, కలుపుగోలుతనం, మంచి మనసు తదితర అంశాల ఆధారంగా విజేతలను నిర్ణయిస్తారని మిస్ వరల్డ్ ఆర్గనైజర్స్ చెబుతున్నారు.
అయితే, ఆయా దేశాల్లో మిస్ వరల్డ్ ను ఎంపిక చేసేటప్పుడు కొన్ని సంస్థలు శరీర కొలతలు చూడవచ్చు లేదా నిబంధనలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. మిస్ వరల్డ్ తరపున ఒక్కో దేశంలో ఒక్కో సంస్థ పోటీ నిర్వహిస్తుంది. భారత్ లో టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ పోటీలను నిర్వహిస్తోంది. గెలుపోటములను నిర్ణయించే జడ్జీలు ఎవరు అన్నది కూడా రహస్యంగా ఉంచుతారు నిర్వాహాకులు. సాధారణంగా 9 లేదా 11 మంది జడ్జీలు ఇందులో ఉంటారు. వారు పోటీదారులతో సీరియస్ ఇంటర్వ్యూ కూడా నిర్వహిస్తారు.