Alleti Maheshwar Reddy : సీఎం రేవంత్‌కు ఓటమి భయం పట్టుకుంది- బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి

మైక్ దొరికిందంటే ఎన్టీఆర్, బాలకృష్ణ డైలాగులు చెబుతున్నారు. ఎప్పుడేం మాట్లాడుతారో సీఎం రేవంత్ కే తెలియదు.

Alleti Maheshwar Reddy : సీఎం రేవంత్‌కు ఓటమి భయం పట్టుకుంది- బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి

Alleti Maheshwar Reddy

Updated On : April 16, 2024 / 8:08 PM IST

Alleti Maheshwar Reddy : బీజేపీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సీఎం రేవంత్ టార్గెట్ గా మరోసారి చెలరేగిపోయారు. సీఎం రేవంత్ రెడ్డి గజినీలా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. ఓటమి భయంతో ముఖ్యమంత్రి రేవంత్ కి రైతుల మీద ప్రేమ పుట్టుకొచ్చిందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలే ఇంకా అమలు చేయలేదన్నారు. వ్యవసాయానికి 19వేల 756 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోకి రాహుల్ గాంధీ కేటాయించిన నగదెంతో చెప్పాలన్నారు. పండిన పంటకు బోనస్ ఇవ్వాలంటే 11,000 కోట్లకు పైగా అవసరం అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లను దండుకునేందుకే ముఖ్యమంత్రి రేవంత్ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

”మహాలక్ష్మికి రూ.12,000లకు పైగా కోట్లు కావాలి. మైక్ దొరికిందంటే ఎన్టీఆర్, బాలకృష్ణ డైలాగులు చెబుతున్నారు. దళితులు, గిరిజనులకు బీసీ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్ చేస్తానన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రజలను మళ్ళీ మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ డమ్మీ క్యాండిడేట్స్ ను పెట్టిందని అంటున్నారు. మరి కాంగ్రెస్ ఏం చేస్తోంది? బీఆర్ఎస్, బీజేపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు బీజేపీ వైపు ఉన్నారు. కాంగ్రెస్ ఎన్ని దొంగ నాటకాలు వేసినా ప్రజలు బీజేపీ వైపే. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలు ఇచ్చి అగ్రనేతలపై నెపం మోపుతున్నారు. దిగజారుడు ఎన్నికల స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. ఎప్పుడేం మాట్లాడుతారో సీఎం రేవంత్ కే తెలియదు. రేవంత్ రెడ్డి ఇంకా పీసీసీ అధ్యక్షుడు అనుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తే బాగుంటుంది” అని హితవు పలికారు ఎమ్మెల్యే ఏలేటి.

Also Read : రబ్బరు చెప్పులతో వచ్చిన హరీశ్ రావుకి వేల కోట్లు ఎలా వచ్చాయ్? మంత్రి దామోదర రాజనర్సింహ