Damodara Raja Narasimha : రబ్బరు చెప్పులతో వచ్చిన హరీశ్ రావుకి వేల కోట్లు ఎలా వచ్చాయ్? మంత్రి దామోదర రాజనర్సింహ

25ఏళ్ల కిందట బీఆర్ఎస్ నేతల పరిస్థితి ఏంటి? ఇప్పుడు వారి ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Damodara Raja Narasimha : రబ్బరు చెప్పులతో వచ్చిన హరీశ్ రావుకి వేల కోట్లు ఎలా వచ్చాయ్? మంత్రి దామోదర రాజనర్సింహ

Damodara Raja Narasimha

Damodara Raja Narasimha బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావుపై నిప్పులు చెరిగారు మంత్రి దామోదర రాజనర్సింహ. హరీశ్ రావుకి వేల కోట్ల ఎలా వచ్చాయి? అని ఆయన ప్రశ్నించారు. వంగి వంగి కాళ్ళు మొక్కింది ఎవరు? అని ప్రశ్నించారు. ప్రపంచంలో ఎక్కడా లేని కుంభకోణం ధరణి అని తీవ్ర ఆరోపణలు చేశారు. పటాన్ చెరు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. రబ్బర్ చెప్పులు వేసుకుని వచ్చిన హరీశ్ రావుకు వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయో చరిత్ర చెప్పమంటారా? అని మంత్రి అన్నారు.

‘వంగి వంగి ఎవరు కాళ్ళు పట్టుకున్నారో అప్పుడున్న కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి తెలియదా? నీ చరిత్ర చెప్పనా? మల్లన్న సాగర్ ప్రాజెక్టు కట్టినప్పుడు కలెక్టర్ ఎవరు? దానివల్ల ఎంతమంది నిర్వాసితులు భూమిని కోల్పోయారో చెప్పమంటావా? ప్రజావేదిక పెట్టుకుని చెప్పమంటారా? ప్రపంచంలో ఎక్కడా లేని కుంభకోణం ఉందంటే ధరణి మాత్రమే. 7 లక్షల కోట్లు అప్పులు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే.

ఫోన్ టాపింగ్ గురించి మాట్లాడమంటారా? ఆస్తుల గురించి మాట్లాడమంటారా? 25ఏళ్ల కిందట బీఆర్ఎస్ నేతల పరిస్థితి ఏంటి? ఇప్పుడు వారి ఆస్తుల విలువ ఎంతో తెలుసా? 18న సంగారెడ్డి, పటాన్ చెరువుకు సంబంధించి అందరి చరిత్రను చెబుతా. నాడు 25 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. కాంగ్రెస్ పార్టీ పోచంపాడును కట్టించింది. ఎందరో త్యాగాలను గుర్తించి ఆంధ్రాలో నష్టపోతామని తెలిసినా కూడా పార్లమెంటులో బిల్లు పెట్టింది యూపీఏ గవర్నమెంట్. ఆనాడు పార్లమెంటులో రెండు సీట్లున్న టీఆర్ఎస్ తెలంగాణ తేలేదు. కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చింది.

తెలంగాణ వచ్చాక అభివృద్ధి, అద్భుతాలు జరుగుతాయని నమ్మాము. కానీ తొమ్మిదిన్నర ఏళ్లలో మోసానికి, దగాకు గురికావాల్సి వచ్చింది. ప్రజాస్వామ్యంలో ఎంతటి వాడినైనా చరమగీతం పాడే శక్తి ఒక్క ఓటు అనే ఆయుధానికే ఉంది. పేద కుటుంబం నుంచి వచ్చిన నీలం మధును గెలిపించుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉంది” అని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.

Also Read : వారికి లైన్ క్లియర్..! పార్లమెంట్ ఎన్నికల వేళ చేరికలపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక ఫోకస్