Danam Nagender : నా ఇంట్లో కేసీఆర్ ఫోటో ఉంటే తప్పేంటి? పోతే జైలుకు పోతా..! ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలనం..
వాళ్లు ఓట్లు వేస్తేనే తాను నెగ్గానని, కాబట్టి కచ్చితంగా వారి అండగా ఉంటానని చెప్పారు. పేదల పట్ల హైడ్రా అధికారులు, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు కరెక్ట్ కాదన్నారు.

Danam Nagender : మీడియా చిట్ చాట్ లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హాట్ కామెంట్స్ చేశారు. హైడ్రా విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. అధికారుల విషయంలో కాంప్రమైజ్ అవ్వను, అవ్వబోను అని తేల్చి చెప్పారాయన. వైఎస్ఆర్ పాలనలో సైతం అధికారుల విషయంలో తాను కాంప్రమైజ్ కాలేదన్నారు. పోతే జైలుకు పోతానని అన్నారు.
తనపై 173 కేసులు ఉన్నాయని కామెంట్ చేశారు. అటు ఇంట్లో లీడర్ల ఫోటోలు ఉంటే తప్పేంటని ప్రశ్నించారు దానం నాగేందర్. తన ఇంట్లో వైఎస్ఆర్, కేసీఆర్ ఫోటోలు ఉన్నాయని చెప్పారు.
హైడ్రా విషయంలో తగ్గేదేలే..
అసెంబ్లీ లాబీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. పలు అంశాలను ఆయన షేర్ చేసుకున్నారు. హైడ్రా విషయంలో తగ్గేదేలేదని ఆయన అన్నారు. 30, 40 ఏళ్ల నుంచి పేదలు నివాసం ఉంటున్న స్థలాల జోలికి వస్తే ఊరుకునేది లేదని దానం నాగేందర్ తేల్చి చెప్పారు.
Also Read : కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు.. నెక్ట్స్ ఏం జరగనుంది?
వాళ్లు ఓట్లు వేస్తేనే తాను నెగ్గానని, కాబట్టి కచ్చితంగా వారి అండగా ఉంటానని చెప్పారు. పేదల పట్ల హైడ్రా అధికారులు, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు కరెక్ట్ కాదన్నారు. తాను పేదల పక్షాన ఉంటానని, ఇదే విషయాన్ని ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు స్పష్టం చేశానన్నారు. పోలీసుల తనపై కేసులు పెట్టుకున్నా పర్లేదన్నారు. తనపై ఇప్పటికే 173 కేసులు ఉన్నాయన్నారు. కొత్త కేసులకు తాను భయపడేది లేదన్నారు.
వైఎస్ఆర్ నా గుండెల్లో ఉంటారు..
లీడర్ల ఫోటోల అంశంపైనా ఆయన స్పందించారు. మనం ఏ పార్టీలో ఉన్నా దాంతో సంబంధం లేకుండా ఇంట్లో ఏ లీడర్ ఫోటో అయినా ఉండొచ్చన్నారు. ఎవరి అభిమానం వారికి ఉంటుందన్నారు. ఇంట్లో లీడర్ల ఫోటోలు ఉండటంలో తప్పు లేదన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు దేవుడు లాంటి వ్యక్తి అని, నిత్యం తన గుండెలో ఉంటారని, తన ఇంట్లో ఎక్కడ చూసినా వైఎస్ఆర్ ఫోటోలు కనిపిస్తాయన్నారు.
కేవలం వైఎస్ఆర్ ఫోటోనే కాదు కేసీఆర్ ఫోటో కూడా తన ఇంట్లో ఉంటుందన్నారు దానం నాగేందర్. ఇక, ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంపైనా ఆయన స్పందించారు. సుప్రీంకోర్టు నోటీసులు ఇంకా తనకు అందలేదన్నారు.
హైడ్రా కూల్చివేతల విషయంలో దానం నాగేందర్ దూకుడుగా వెళ్తున్నారని చెప్పాలి. కూల్చివేతలను ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశారు. గతంలో బంజారాహిల్స్ కూల్చివేతలకు అడ్డు పడ్డారు. ఆ తర్వాత తన నియోజకవర్గం పరిధిలోకి వచ్చే చింతల్ బస్తీలో షాపుల తొలగింపును అడ్డుకునే ప్రయత్నం చేశారు. హైడ్రా అధికారులు, పోలీసులతో ఆయన వాగ్వాదానికి కూడా దిగారు. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ నుంచి వచ్చాక మీ సంగతి తేలుస్తానని అధికారులకు దానం నాగేందర్ వార్నింగ్ ఇచ్చిన సందర్భం కూడా ఉంది.
ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని వార్నింగ్..
హైడ్రా కూల్చివేతల అంశాన్ని సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్తానని దానం పదే పదే చెబుతున్నారు. గత 30, 40 ఏళ్ల నుంచి పేదలు నివాసం ఉంటున్నారని, అలాంటి వారికి గూడు లేకుండా చేయడం కరెక్ట్ కాదన్నారు. ఇలాంటి చర్యలు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారే ప్రమాదం ఉందన్నారు దానం నాగేందర్.
ప్రజాప్రతినిధిగా, ప్రజల నుంచి వచ్చిన నేతగా తాను పేదల పక్షాల నిలబడతానని పలు సందర్భాల్లో దానం తేల్చి చెప్పారు. ఈ విషయంలో హైడ్రా అధికారులు తనపై పోలీసు కేసులు పెట్టినా తాను వెనక్కి తగ్గేది లేన్నారు దానం నాగేందర్. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజలకు అండగా నిలవాల్సి ఉంటుందన్నారు.