MLA Etala Rajender : దళితబంధు మాదిరి గిరిజనబంధు అమలు చేయాలి : ఈటల

దళితబంధు మాదిరి గిరిజనబంధు అమలు చేయాలని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ప్రజలను వంచించటానికి సీఎం‌ కేసీఆర్ దొంగ స్కీంలను తీసుకొచ్చారని ఘాటు వ్యాఖ్యాలు చేశారు.

MLA Etala Rajender : దళితబంధు మాదిరి గిరిజనబంధు అమలు చేయాలి : ఈటల

Etala And Kcr

Updated On : November 14, 2021 / 4:29 PM IST

Etala comments over CM KCR : దళితబంధు మాదిరి గిరిజనబంధు అమలు చేయాలని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ప్రజలను వంచించటానికి సీఎం‌ కేసీఆర్ దొంగ స్కీంలను తీసుకొచ్చారని ఘాటు వ్యాఖ్యాలు చేశారు. నవంబర్ 4న దళితబంధు అమలు చేస్తామన్న కేసీఆర్ మాటలు ఒట్టి మాటలు అని విమర్శించారు. రిజర్వేషన్లను అడ్డుకుని గిరిజనుల కళ్ళల్లో మట్టికొట్టిన‌ వ్యక్తి సీఎం కేసీఆర్ అని మండిపడ్డారు.

మూడెకరాల భూమి దేవుడెరుగు.. సాగుచేసుకుంటోన్న పోడు భూములను లాక్కుంటున్నారని ఫైర్ అయ్యారు. ధరణి పోర్టల్ వలన సొంత భూముల‌ మీద హక్కులు కోల్పోతున్నామని పేర్కొన్నారు. సమాజంలో అత్యంత వెనుకబడిన వారు హరిజనులు, గిరిజనులు అని తెలిపారు. కేసీఆర్ మాటలు గొప్పగా ఉంటాయి మరి.. అచరణకు మాత్రం నోచుకోవన్నారు.

Joined The YCP : వైసీపీలో చేరిన టీడీపీ, బీజేపీ ముఖ్య నేతలు

తెలంగాణ వస్తే గిరిజనులకు రిజర్వేషన్లు ఇస్తామన్న కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు. గిరిజన విద్యార్థులకు పాత బకాయిలు, మెస్ ఛార్జీలు వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారో కేసీఆర్ చెప్పాలన్నారు.