Medipally Sathyam : పాడి కౌశిక్ రెడ్డిని రెచ్చగొట్టి కేటీఆర్ నీచ రాజకీయాలు చేస్తున్నారు- ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన నీచపు పార్టీ ఈ దేశ చరిత్రలో ఏదైనా ఉందంటే అది ముమ్మాటికీ బీఆర్ఎస్ పార్టీ.

Medipally Sathyam : పాడి కౌశిక్ రెడ్డిని రెచ్చగొట్టి కేటీఆర్ నీచ రాజకీయాలు చేస్తున్నారు- ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

Updated On : January 13, 2025 / 6:47 PM IST

Medipally Sathyam : ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నిప్పులు చెరిగారు. కౌశిక్ ను ఎగదోసి మాజీ మంత్రి కేటీఆర్ శిఖండి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవద్దనే ఉద్దేశంతోనే సమావేశాన్ని రసాభాస చేశారని ధ్వజమెత్తారు. పార్టీ ఫిరాయింపులు, నీచ రాజకీయాలు చేసింది బీఆర్ఎస్సే అని ఆరోపించారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.

‘కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు.. పాడి కౌశిక్ రెడ్డి లాంటి సైకోలను ఎగదోసి శిఖండి రాజకీయాలు చేస్తున్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పడు ఆనాడు టీడీపీ ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లోకి లాక్కున్నారు. మరోసారి 2018లో బీఆర్ఎస్ ను ప్రజలు 88 సీట్లతో గెలిపించినా.. రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది ఉండకూడదని కాంగ్రెస్ ఎమ్మెల్యేను లాక్కున్నారు.

Also Read : కలెక్టరేట్ ఘటన.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదు

నాడు కాంగ్రెస్ నుంచి 19మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అయితే, వారికి ప్రతిపక్ష లేకుండా చేయాలని కేసీఆర్ ప్రయత్నం చేశారు. ప్రతిపక్ష హోదా ఉంటే ప్రజల తరఫున కొట్లాడతారని, వారికి మంచి పేరు వస్తుందని.. ఆనాడు 12మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కుకున్నారు. కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన నీచపు పార్టీ ఈ దేశ చరిత్రలో ఏదైనా ఉందంటే అది ముమ్మాటికీ బీఆర్ఎస్ పార్టీ.

పాడి కౌశిక్ రెడ్డి సైకోలా వ్యవహరించారు. నిన్న కలెక్టరేట్ లో పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరు దారుణం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు నిర్వహిస్తున్న సమీక్ష సమావేశంలో కౌశిక్ రెడ్డి రెచ్చిపోయారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవద్దనే సంకల్పంతో ఇలా రసాభాస చేశారు’ అని ఎమ్మెల్యే సత్యం నిప్పులు చెరిగారు.

 

Also Read : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై స్పీకర్ కు ఫిర్యాదు..