MLA Sandra Venkata Veeraiya: దమ్ముంటే నాపై పోటీ చెయ్.. పిడమర్తి రవికి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సవాల్

తప్పుడు పద్ధతులతో చాలామంది ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు చేసిన వ్యక్తి రెండుసార్లు పోటీ చేసినా నియోజకవర్గ ప్రజలు తిరస్కరించారు. నియోజకవర్గం నుంచి పారిపోయి ఆరోపణలు చేస్తున్నాడు. సవాల్ చేస్తున్నా.. దమ్ముంటే సత్తుపల్లి వచ్చి నాపై పోటీ చేయాలి.

MLA Sandra Venkata Veeraiya: దమ్ముంటే నాపై పోటీ చెయ్.. పిడమర్తి రవికి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సవాల్

MLA Sandra Venkata Veeraiah: దమ్ముంటే తనపై పోటీ చేయాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవికి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సవాల్ విసిరారు. ఖమ్మం జిల్లా, పెనుబల్లి మండలం గంగదేవిపాడు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీకి చెందిన కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

Madhya Pradesh: బోరుబావిలో పడ్డ ఏడేళ్ల బాలుడు మృతి.. ఆస్పత్రికి తీసుకెళ్లినా దక్కని ప్రాణం

అనంతరం ఎమ్మెల్యే సండ్ర మాట్లాడారు. పిడమర్తి రవిపై విమర్శలు చేశారు. ‘‘తప్పుడు పద్ధతులతో చాలామంది ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు చేసిన వ్యక్తి రెండుసార్లు పోటీ చేసినా నియోజకవర్గ ప్రజలు తిరస్కరించారు. నియోజకవర్గం నుంచి పారిపోయి ఆరోపణలు చేస్తున్నాడు. సవాల్ చేస్తున్నా.. దమ్ముంటే సత్తుపల్లి వచ్చి నాపై పోటీ చేయాలి. ప్రజా క్షేత్రంలో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. మూర్ఖపు పద్ధతులతో ప్రజల నాడి కనిపెట్టలేక, ప్రజాసేవ చేయలేక చాలా రకాల విమర్శలు చేస్తున్నారు. చేసిన విమర్శలు అన్నీ కూడా మీ నాయకత్వానికి పనికొస్తాయి. పుట్టుకతో ఎవరూ శ్రీమంతులు కాదు.

MP Arvind: చట్టాన్ని గౌరవిస్తాం అన్నవాళ్లు సుప్రీం కోర్టుకు ఎందుకెళ్లారు.. కవిత తీరుపై అరవింద్ విమర్శలు

మీ నాయకుడు కూడా తాపీ, బొచ్చ పట్టుకొని రాజకీయ జీవితం ప్రారంభించారు. నీ పక్కన ప్రెస్ మీట్‌లో కూర్చున్న రాజకీయ నాయకులందరి చరిత్ర చెప్పగలను. విధానపరంగా, సిద్ధాంత పరంగా విమర్శలు చేస్తే దానిని వదిలిపెట్టి తప్పుడు పద్ధతిలో విమర్శలు చేస్తున్నారు. నీ ఉనికిని సత్తుపల్లి ప్రజలు తిరస్కరించారు. దమ్ముంటే నాపై పోటీ చేయాలి. ప్రజాక్షేత్రంలో ఎవరి శక్తి ఏంటో తెలుసుకుందాం. ఎలాంటి లాలూచీ అలవాట్లు లేవు.

మద్యం తాగే, అమ్మే అలవాటు లేదు. మద్యం షాపులు ఎవరు అమ్ముతున్నారో తెలుసు. కోడి పందాలు ఎవరు ఆడుతున్నారో, క్యాసినోలకు ఎవరు వెళ్తున్నారో కూడా తెలుసు. మీ నాయకులు పెట్టిన కోడిపందాలకు వెళ్లి తాగి తందనాలాడి, తిరిగి మాపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నావు. ప్రజలకు తెలుసు ఎవరి రాజకీయ జీవితం ఏంటో’’ అంటూ సండ్ర వెంకట వీరయ్య వ్యాఖ్యానించారు.