MP Kavita-Shankar Nayak : మాజీ ఎంపీ కవితకు అవమానం..మాట్లాడుతుండగా మైక్‌ లాక్కున్న ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌

రైతు దీక్షలో ఎంపీ కవిత మాట్లాడుతుండగా ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ మైక్‌ లాక్కున్నాడు. దీంతో కవిత బిత్తర పోయారు.

MP Kavita-Shankar Nayak : మాజీ ఎంపీ కవితకు అవమానం..మాట్లాడుతుండగా మైక్‌ లాక్కున్న ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌

Mp Kavitha

Updated On : May 13, 2022 / 12:40 PM IST

MP Kavita-Shankar Nayak : మహబూబాబాబాద్‌ టీఆర్ఎస్‌లో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మహబూబాబాబాద్‌లో ఎంపీ కవితకు ఎమ్మెల్యే శంకర్ నాయక్‌ షాక్‌ ఇచ్చారు. రైతు దీక్షలో ఎంపీ కవిత మాట్లాడుతుండగా ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ మైక్‌ లాక్కున్నాడు. దీంతో కవిత బిత్తర పోయారు. తాను జిల్లా అధ్యక్షురాలిగా మాట్లాడుతున్నానని కవిత చెప్పగా.. అయితే తాను లోకల్‌ ఎమ్మెల్యేనంటూ ఆమె చేతిలోని మైక్‌ను శంకర్‌ నాయక్‌ బలవంతంగా లాక్కున్నారు.

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ తలపెట్టిన రైతు దీక్షలో మంత్రి సత్యవతి రాథోడ్ సమక్షంలో వర్గవిభేదాలు బయట పడ్డాయి. మహబూబాబాద్ జిల్లా పార్టీ ఆధ్యక్షరాలు, ఎంపీ కవిత రైతు దీక్షలో మాట్లాడుతుండగానే మధ్యలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ మైక్ లాక్కుకున్నారు. దీంతో కవిత బిత్తరబోయారు.

Attack On TRS MLA : టీఆర్ఎస్ ఎమ్మెల్యే కారుపై గుడ్లతో దాడి

మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్యక్షతన అనగానే..డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అలా కాదు..పార్టీ జిల్లా ఆధ్యక్షురాలు ఆధ్యక్షతన అనాలి అని..మంత్రికి ఎమ్మెల్యే రెడ్యా నాయక్ సూచించారు.