Mlc Kavitha: ధర్నా చౌక్ దగ్గర దీక్షను విరమించిన ఎమ్మెల్సీ కవిత.. ఎన్నికలు ఎలా ఆపాలో మాకు తెలుసు అంటూ వార్నింగ్..

తెలంగాణ బీసీ బిడ్డలు ఊరుకోరు.. మళ్ళీ సమాలోచన చేసి మరో రూపంలో పోరాటం చేస్తాం..

Mlc Kavitha: ధర్నా చౌక్ దగ్గర దీక్షను విరమించిన ఎమ్మెల్సీ కవిత.. ఎన్నికలు ఎలా ఆపాలో మాకు తెలుసు అంటూ వార్నింగ్..

MLC Kavitha

Updated On : August 4, 2025 / 6:55 PM IST

Mlc Kavitha: హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద దీక్షను విరమించారు ఎమ్మెల్సీ కవిత. 72 గంటల నిరాహార దీక్షకు కోర్టు అనుమతి నిరాకరించింది. కోర్టు తీర్పుతో దీక్షను విరమించారు కవిత. కోర్టు తీర్పును గౌరవిస్తూ, దీక్షను ఇంతటితో ముగిస్తున్నట్లు ఆమె చెప్పారు. పోరాటం ఆగదన్న కవిత.. అనేక రూపాల్లో పోరాటం చేస్తామన్నారు.

ఒక్క అడుగు వెనక్కి వేస్తే.. 10 అడుగులు ముందుకు వేస్తామన్నారు. ”మీరు రాష్ట్రపతి వద్దకు వెళ్ళండి.. సుప్రీంకోర్టులో గవర్నర్ మీద కేసు వేయండి.. ఢిల్లీలో టైమ్ పాస్ ధర్నాలు చేస్తే.. తెలంగాణ బీసీ బిడ్డలు ఊరుకోరు.. మళ్ళీ సమాలోచన చేసి మరో రూపంలో పోరాటం చేస్తాం.. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ జరగకుండా వెళితే.. ఎన్నికలు ఎలా ఆపాలో మాకు తెలుసు..” అని కవిత అన్నారు.

బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్, బీజేపీలు బీసీలను మోసం చేస్తున్నాయని కవిత ఆరోపించారు. బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ ఎత్తులను చిత్తు చేస్తామన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం అధికార పార్టీ ఢిల్లీలో కొట్లాడేందుకు సిద్ధమవగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ దగ్గర దీక్షకు దిగారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42శాతం రాజకీయ రిజర్వేషన్లు, విద్య ఉద్యోగాల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో కవిత 72 గంటల నిరాహార దీక్షకు దిగారు.

అయితే తాను చేపట్టిన దీక్షకు కేవలం ఒక్కరోజు మాత్రమే అనుమతి ఇవ్వడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నా చౌక్ ని ఓపెన్ చేశామని గొప్పులు చెప్పుకునే నాయకులు అనుమతి మాత్రం ఎందుకివ్వటం లేదని ప్రశ్నించారు. కాగా, బీసీ బిల్లు సాధనం కోసం ధర్నా చౌక్ లో 72 గంటల నిరాహార దీక్ష చేపట్టారు కవిత.

Also Read: కాళేశ్వరంలో మొత్తం తప్పు కేసీఆర్, హరీశ్‌దే.. తేల్చేసిన కమిషన్.. రిపోర్ట్ బయటపెట్టిన ఉత్తమ్