Vijayashanthi: సరైన సమయంలో సరైన వ్యక్తులకు పదవులు వస్తాయి- ఎమ్మెల్సీ విజయశాంతి కీలక వ్యాఖ్యలు
అధికార పార్టీ నేతల్లో ఉన్న విబేధాలు, వారి మధ్య నెలకొన్న సమస్యలను సరిదిద్దే పనిలో పడ్డారు మీనాక్షి.

Vijayashanti
Vijayashanthi: ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, విజయశాంతిలతో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ రివ్యూ ముగిసింది. అనంతరం ఎమ్మెల్సీ విజయశాంతి మీడియాతో చిట్ చాట్ చేశారు. సరైన సమయంలో సరైన వ్యక్తులకు పదవులు వస్తాయని విజయశాంతి అన్నారు. ఎవరికి ఏ పదవులు ఇవ్వాలో అధిష్టానానికి తెలుసని చెప్పారు. మొన్నటి కమిటీలలో నా పేరు లేదు అంటే.. మరో కమిటీలో అవకాశం ఉంటుందేమో అని విజయశాంతి అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై మీనాక్షి నటరాజన్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ నేతల్లో ఉన్న విబేధాలు, వారి మధ్య నెలకొన్న సమస్యలను సరిదిద్దే పనిలో పడ్డారు మీనాక్షి.
Also Read: రాజీవ్ యువ వికాసం స్కీమ్.. రుణాల పంపిణీకి సర్వం సిద్ధం… మొదట వీరికి ఇస్తారు..
తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో వరుస మీటింగ్స్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా నాయకులకు మీనాక్షి నటరాజన్ పలు సూచనలు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు గ్రామ, పట్టణ ప్రాంతాల్లోని స్థానిక సమస్యలపై ఆరా తీస్తున్నారు.
అటు మీనాక్షి నటరాజన్ సమీక్ష సమావేశాలు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్, నాగర్ కర్నూల్, వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. పార్టీ పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత ఎమ్మెల్సీలు, ఎంపీలతో భేటీ అయ్యారు. ఇక సాయంత్రం కార్పొరేషన్ ఛైర్మన్లతో రివ్యూ చేయనున్నారు. కొన్ని రోజులుగా గ్రౌండ్ లెవెల్ లో పార్టీ పరిస్థితులపై సమీక్షిస్తున్నారు మీనాక్షి నటరాజన్.
అటు మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావుతో మీనాక్షి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితులపై ఆమె రివ్యూ చేశారు.