Nallala Odelu: ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆగడాలను భరించలేకపోతున్నాం: మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు

తాను ఇక చనిపోయే వరకు కాంగ్రెస్ లోనే ఉంటానని నల్లాల ఓదేలు అన్నారు.

Nallala Odelu: ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆగడాలను భరించలేకపోతున్నాం: మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు

Nallala Odelu

Nallala Odelu – Balka Suman: బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆగడాలను భరించలేకపోతున్నామంటూ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు పలు ఆరోపణలు చేశారు. తెలంగాణ(Telangana)లోని మంచిర్యాల జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… చెన్నూరు నియోజకవర్గం రజాకార్ల చేతుల్లోకి వెళ్లిపోయినట్లుగా ఉందని విమర్శించారు.

తన భార్యకు మంచిర్యాల జడ్పీ చైర్‌పర్సన్ పదవి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందని, అంతేగానీ బాల్క సుమన్ కాదని చెప్పారు. గత ఏడాది తమను మంత్రి కేటీఆర్ పిలిచి బీఆర్ఎస్ పార్టీలోనే ఉండాలని, ఎమ్మెల్యే అవకాశం కల్పిస్తామని చెప్పారని వివరించారు. తాను బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి మళ్లీ అదే పార్టీలోకి వెళ్లినందుకు ప్రజలు క్షమించాలని అన్నారు.

ఎమ్మెల్యే బాల్క సుమన్ రెండుసార్లు తన ఇంటికొచ్చి ఎమ్మెల్సీ పదవి ఇప్పిస్తానని చెప్పారని తెలిపారు. తనకు ప్రజలు అవకాశం ఇస్తే తమ నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. ఈ నియోజకవర్గంలో బాల్క సుమన్ రూ.500 కోట్లు అక్రమంగా సంపాదించారని ఆరోపించారు. తాను ఇక చనిపోయే వరకు కాంగ్రెస్ లోనే ఉంటానని అన్నారు.

Delimitation for Women Reservation: 2029 కాదు 2031 లేదంటే 2039లో మహిళా రిజర్వేషన్లు అమలయ్యే ఛాన్స్.. పెద్ద అడ్డంకిగా మారిన డీలిమిటేషన్ గురించి పూర్తిగా తెలుసుకోండి