Balakrishna: హైదరాబాద్‌లో రేవంత్ రెడ్డితో నందమూరి బాలకృష్ణ భేటీ

అనంతరం రేవంత్ రెడ్డితో పలు అంశాలపై బాలకృష్ణ మాట్లాడారు. మరోవైపు, రేవంత్ రెడ్డిని ప్రముఖ..

Balakrishna: హైదరాబాద్‌లో రేవంత్ రెడ్డితో నందమూరి బాలకృష్ణ భేటీ

Balakrishana Meets Telangana CM Revanth reddy

Updated On : December 30, 2023 / 6:37 PM IST

హైదరాబాద్‌లోని బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీడీపీ ఎమ్మెల్యే, బసవతారకం ఆసుపత్రి ఛైర్మన్ బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ సమయంలో బసవతారకం ఆసుపత్రి ట్రస్ట్ సభ్యులు కూడా బాలకృష్ణతోనే ఉన్నారు. అనంతరం రేవంత్ రెడ్డితో పలు అంశాలపై బాలకృష్ణ మాట్లాడారు.

PV Sindhu

మరోవైపు, రేవంత్ రెడ్డిని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ డీఎస్పీ నళిని కూడా ఇవాళ రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే.

రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నాగార్జున దంపతులు

Nagarjuna : రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నాగార్జున దంపతులు

వీరితో పాటు మరికొందరు ప్రముఖులు కూడా హైదరాబాద్‌లోని బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రేవంత్ రెడ్డిని కలిశారు. పలు అంశాలపై రేవంత్ రెడ్డితో వారు మాట్లాడారు.