డేటా దొంగిలించి హైదరాబాద్ ఐటీ బ్రాండ్ పరువు తీశారు : లోకేష్

తెలంగాణ ప్రభుత్వంపై ట్విట్టర్ లో నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Published By: veegamteam ,Published On : March 4, 2019 / 06:31 AM IST
డేటా దొంగిలించి హైదరాబాద్ ఐటీ బ్రాండ్ పరువు తీశారు : లోకేష్

Updated On : March 4, 2019 / 6:31 AM IST

తెలంగాణ ప్రభుత్వంపై ట్విట్టర్ లో నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంపై ట్విట్టర్ లో ఏపీ మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ డేటాను దొంగిలించి హైదరాబాద్ ఐటీ బ్రాండ్ పరువు తీశారని తెలిపారు. రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటే.. ఏపీలో ప్రచారం చేస్తారనుకున్నా..కానీ ఇలా డేటా దొంగిలిస్తారా అని ఎద్దేవా చేశారు. ధైర్యంగా ఏపీకి వచ్చి దొంగ అబ్బాయి (జగన్) తరపున ప్రచారం చేస్తారనుకున్నానని పేర్కొన్నారు. కానీ డేటా దొంగిలించి హైదరాబాద్ ఐటీ బ్రాండ్ ను దెబ్బతీశారని తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. 
Also Read : ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన మంత్రి దేవినేని : అర్ధరాత్రి తోపుడు బండ్ల పంపిణీ

హైకోర్టు సాక్షిగా దొరగారి దొంగతనం బయటపడిందన్నారు. తెల్లకాగితాలపై వీఆర్వో సంతకాలతో అడ్డంగా దొరికారని పేర్కొన్నారు. ప్రజాక్షేత్రంలో చంద్రబాబు గారిని ఎదుర్కొనే దమ్ములేక ఐటీ కంపెనీలపై దాడి చేశారని తెలిపారు. ఉద్యోగస్తులను అక్రమంగా అరెస్టు చేశారని తేలిపోయిందని లోకేష్ ట్వీట్ చేశారు. 
Also Read : ఐటీ గ్రిడ్ వివాదం: జడ్జి ముందుకు ఆ నలుగురు

ఐటీ గ్రిడ్ సంస్థలో ఉన్న డేటాను తెలంగాణ ప్రభుత్వం చోరీ చేసి వైసీపీకి ఇస్తోందని ఆరోపించారు. డేటా చోరీ చేస్తూ చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం, వైసీపీ కలిసి కుట్ర రాజకీయాలకు కేంద్రంగా మారారని విమర్శించారు. హైదరాబాద్ కేంద్రంగా ఆంధ్రప్రజలను ఇబ్బంది పెట్టాలనుకుంటే.. వారి ఆటలు సాగవని అభిప్రాయపడ్డారు.