కాంగ్రెస్‌లోకి వచ్చాక చాలా సంతోషంగా ఉంది, స్వేచ్ఛ వచ్చిన ఫీలింగ్ ఉంది- కేకే కీలక వ్యాఖ్యలు

ఫ్యామిలీ పబ్లిసిటీ గత ప్రభుత్వంలో ఉన్న వారు చేశారు. కాంగ్రెస్ ఎంపీలతోనే తెలంగాణ వచ్చింది.

కాంగ్రెస్‌లోకి వచ్చాక చాలా సంతోషంగా ఉంది, స్వేచ్ఛ వచ్చిన ఫీలింగ్ ఉంది- కేకే కీలక వ్యాఖ్యలు

K Keshava Rao : బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన సీనియర్ నేత కే.కేశవ రావు.. కాంగ్రెస్ లో చేరికపై స్పందించారు. కాంగ్రెస్ నా సొంత ఇల్లు అని ఆయన అన్నారు. నేను కాంగ్రెస్ మనిషిని అని చెప్పారు. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లోకి వచ్చాక ఇప్పుడు స్వేచ్చ వచ్చిన ఫీలింగ్ ఉందన్నారు కేకే. కాంగ్రెస్ ఎంపీలతోనే తెలంగాణ వచ్చిందని కీలక వ్యాఖ్యలు చేశారు కేకే.

”కాంగ్రెస్ లోకి వచ్చినందుకు సంతోషంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజస్వామ్యబద్ధంగా పాలన ఉంది. 6 నెలల్లో ఎవరు కూడా అంచనా వేయలేము. 6 నెలల్లో ప్రతి అభివృద్ధి కార్యక్రమం చూశా. ఫ్యామిలీ పబ్లిసిటీ గత ప్రభుత్వంలో ఉన్న వారు చేశారు. బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీగా ఉన్నా కాబట్టి రాజీనామా చేశా. నైతిక విలువలతో రిజైన్ చేశా. రాజ్యసభ ఛైర్మన్ కి కూడా అదే చెప్పాను. నేను కాంగ్రెస్ మనిషిని. ఖర్గే కంటే నేను రెండేళ్ళు పెద్దోడిని” అని కేకే అన్నారు.

కేకే రాజీనామాపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి ఏది మంచిదో అదే నిర్ణయం కేకే తీసుకున్నారని ఆయన అన్నారు. కేకే సేవలను పార్టీ వినియోగించుకుంటుందని తెలిపారు.

నిన్న కాంగ్రెస్ లో చేరిన కేకే, ఈరోజు తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో కేకే ఇంటికి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. మర్యాదపూర్వకంగా ఇరువురు నేతలు కలుసుకున్నారు.

Also Read : దానం నాగేందర్‌‌ను మాత్రమే ఎందుకు టార్గెట్ చేశారు? ఇంతకీ బీజేపీ వ్యూహం ఏంటి?