Phone Tapping Case : పోలీసుల అదుపులో మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు.. సిరిసిల్ల వదిలి వెళ్లొద్దంటూ ఆదేశాలు!
Phone Tapping Case : రాజన్న సిరిసిల్లలోని శ్రీనగర్ కాలనీలోని తన నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ప్రణీత్ రావును పోలీసులు హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.

Panjagutta Police Arrested Former DSP Praneeth Rao In Phone Tapping Case
Phone Tapping Case : మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజన్న సిరిసిల్లలోని శ్రీనగర్ కాలనీలోని తన నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ప్రణీత్ రావును పోలీసులు హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ప్రణీత్ రావు సస్పెండ్ తర్వాత సిరిసిల్ల వదిలి వెళ్లొద్దంటూ పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు.
ఎస్ఐబీ, ఎడిషనల్ ఎస్పీ రమేశ్ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద ప్రణీత్ రావుతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. ప్రణీత్ రావు ప్రతిపక్ష నేతల ఫోన్ నెంబర్లు ట్యాపింగ్ చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు ప్రణీత్ రావును అదుపులోకి తీసుకున్నారు.
Read Also : Bjp South Mission : మిషన్ సౌత్.. 400 సీట్లు గెలిచేందుకు బీజేపీ వ్యూహం ఏంటి?