Patnam Mahender Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ భారీగా చేరికలు.. 20న ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్న నేతలు వీరే..
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో వారు కాంగ్రెస్ లో చేరతారు.

Patnam Mahender Reddy
Patnam Mahender Reddy – Congress: తెలంగాణ (Telangana) కాంగ్రెస్‌లో చేరికలు కొనసాగుతున్నాయి. ఈ నెల 20న కాంగ్రెస్ లో మరికొంత మంది నేతలు చేరనున్నారు. ఢిల్లీ(Delhi)లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) సమక్షంలో వారు కాంగ్రెస్ లో చేరతారు.
రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ముగ్గురు మహిళా జడ్పీ చైర్‌పర్సన్ లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. రంగారెడ్డి జిల్లా చైర్‌పర్సన్ తీగల అనిత రెడ్డి, వికారాబాద్ జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి, గద్వాల జడ్పీ చైర్‌పర్సన్ సరితా తిరుపతయ్య కాంగ్రెస్ లో చేరతారు.
అలాగే, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంతో పాటు మందుల సామెల్, రామారావు పటేల్, కోదాడకు చెందిన శశిధర్ రెడ్డి, ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పి ఖర్గే పార్టీలోకి ఆహ్వానించనున్నారు.
I-N-D-I-A: మెగా విపక్ష సమావేశం అనంతరం.. ఇండియా (I-N-D-I-A) కూటమి నేతలు ఏమన్నారంటే?