Pawan Kalyan : రేపు కూకట్‌పల్లి నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ రోడ్ షో..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు కూకట్ పల్లి నియోజవర్గంలో పర్యటించనున్నారు.

Pawan Kalyan : రేపు కూకట్‌పల్లి నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ రోడ్ షో..

Pawan Kalyan Election Campaign

Updated On : November 27, 2023 / 4:04 PM IST

Pawan Kalyan road show in Kukatapally : తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత వవన్ కల్యాణ్ బిజీ బిజీగా ఉన్నారు. బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా తమ అభ్యర్ధుల్ని గెలిపించాలంటూ ప్రజలకు పిలుపునిస్తున్నారు. పవన్ ప్రచారంతో బీజేపీ,జనసేన నేతలు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం ఉరకలు వేస్తోంది. జనసేన రోడ్ షోలకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పర్యటించిన పవన్ రేపు కూకట్ పల్లి నియోజవర్గంలో పర్యటించనున్నారు. దీని కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.

పవన్ కూకట్ పల్లి రోడ్ షోలో భాగంగా రేపు మధ్యాహ్నం బాలానగర్ నుంచి హస్మత్ పాట అంబేడ్కర్ విగ్రహం వరకూ కొనసాగనుంది. న్యూ బోయిన్ పల్లి సిగ్నల్ క్రాస్ నుంచి వయా బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ మీదుగా ఓల్డ్ బోయిన్ పల్లి చెక్ పోస్ట్, హస్మత్ పేట బస్టాప్, అంబేడ్కర్ విగ్రహం వరకూ రోడ్ షో కొనసాగనుంది.

దీంతో అటు బీజేపీ, ఇటు జనసేన నేతలతో పాటు కార్యకర్తలు కూడా ఈ షోలో పాల్గొనన్నారు. ఇక పవన్ రోడ్ షో అంటూ ఎలా ఉంటుందో తెలిసిన విషయమే.. ఆయన అభిమానులు కూడా ఈ రోడ్ షోకు భారీగా తరలిరానున్నారు. దీంతో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. కాగా.. ఇప్పటికే తెలంగాణలో అటు బీజేపీ అగ్రనేతల వరుస పర్యటనలు..ఇటు పవన్ కల్యాణ్ పర్యటనలతో బీజేపీ, జనసేన నేతల్లో కొత్త జోష్ నెలకొంది.

Also Read: ఫాంహౌస్ ముఖ్యమంత్రి అవసరమా.. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ