PM Modi : కాంగ్రెస్, బీఆర్ఎస్ తెలంగాణను నాశనం చేశాయి : ప్రధాని మోదీ

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుందని అన్నారు. తెలంగాణ కొత్త చరిత్ర లిఖించబోతోందని తెలిపారు.

PM Modi : కాంగ్రెస్, బీఆర్ఎస్ తెలంగాణను నాశనం చేశాయి : ప్రధాని మోదీ

Narendra Modi

PM Modi – Congress and BRS : కాంగ్రెస్, బీఆర్ఎస్ తెలంగాణను నాశనం చేయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. అన్ని వర్గాలను బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వంచించాయని ఆరోపించారు. సన్నకారు రైతులను బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఫాంహౌస్ ముఖ్యమంత్రి అవసరమా అంటూ తెలుగులో ప్రశ్నించారు. సోమవారం మహబూబాబాద్ లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. తమతో దోస్తీకి కేసీఆర్ ప్రయత్నించారని, తాము తిరస్కరించడంతో అప్పటి నుంచి దుమ్మెత్తిపోస్తున్నారని తెలిపారు. తనను విమర్శించేందుకు కేసీఆర్ ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సాగనంపాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు.

Priyanka Gandhi : మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకొస్తే.. ధరణి పోర్టల్ పేరుతో ఇళ్లు, వాకిళ్లు, భూములు లాక్కుంటారు : ప్రియాంక గాంధీ

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుందని అన్నారు. తెలంగాణ కొత్త చరిత్ర లిఖించబోతోందని తెలిపారు. తెలంగాణలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతోందని జోస్యం చెప్పారు. తమ పార్టీ తరపున మొట్టమొదట ముఖ్యమంత్రి బీసీ వ్యక్తి అవుతారని తెలిపారు. సామాజిక న్యాయం బీజేపీతో సాధ్యమని తెలుగులో అన్నారు.