మంత్రి వర్గం నుంచి సురేఖను తప్పిస్తారన్న ప్రచారంలో నిజం లేదు: టీపీసీసీ అధ్యక్షుడు

మాజీ మంత్రి కేటీఆర్ తీరు వల్లే అలా కామెంట్స్ చేశారని, అయినా అలా మాట్లాడాల్సింది కాదని అన్నారు.

మంత్రి వర్గం నుంచి సురేఖను తప్పిస్తారన్న ప్రచారంలో నిజం లేదు: టీపీసీసీ అధ్యక్షుడు

Mahesh Kumar Goud

Updated On : October 11, 2024 / 4:17 PM IST

సినీనటుడు అక్కినేని నాగార్జున కుటుంబంపై చేసిన వాఖ్యలను కొండా సురేఖ వెనక్కి తీసుకున్నారని, ఆరోజే ఆ ఇష్యూ క్లోజ్ అయిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై ఇప్పటికీ పలువురు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఇవాళ మీడియా సమావేశంలో మహేశ్ కుమార్ గౌడ్ దీనిపై మాట్లాడారు.

మంత్రి వర్గం నుంచి సురేఖను తప్పిస్తారని ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని మహేశ్ కుమార్‌ తెలిపారు. అలాగే, కొండా సురేఖ కామెంట్ల విషయంపై అధిష్ఠానం ఎటువంటి వివరణ అడగలేదని చెప్పారు. నాగార్జునపై సురేఖ చేసిన కామెంట్స్‌ ఉద్దేశపూర్వకంగా చేసినవి కాదని మహేశ్ కుమార్ తెలిపారు.

మాజీ మంత్రి కేటీఆర్ తీరు వల్లే అలా కామెంట్స్ చేశారని, అయినా అలా మాట్లాడాల్సింది కాదని అన్నారు. నాగార్జున కోర్టును ఆశ్రయించారని, కోర్టు ఏం చెబుతుందో చూద్దామని అన్నారు. సోషల్ మీడియాను బీఆర్ఎస్‌ దుర్వినియోగం చేస్తోందని, తాము ఏనాడూ దుర్వినియోగం చేయలేదని అన్నారు.

సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. మరోవైపు, ఎంఐఎంతో స్నేహం వేరని, శాంతిభద్రతల అంశం వేరని ఆయన అన్నారు. ఫిరోజ్ ఖాన్ పై దాడి విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లానని, దాడుల విషయంలో కఠినంగా ఉంటామని చెప్పారు. భావితరాల కోసమే హైడ్రాను తీసుకొచ్చామని, మూసీ అభివృద్ధి చేయనున్నామని అన్నారు.

Teppotsavam: కృష్ణానదిలో తెప్పోత్సవం రద్దు.. ఎందుకంటే?