Teppotsavam: కృష్ణానదిలో తెప్పోత్సవం రద్దు.. ఎందుకంటే?
కృష్ణానదికి ఎలాంటి ఇన్‌ఫ్లో లేకపోతేనే ఈ ఉత్సవ నిర్వహణకు జలవనరుల శాఖ అనుమతి ఇస్తుంది.

విజయదశమి సాయంత్రాన కృష్ణానదిలో ప్రతి ఏడాది నిర్వహించే హంస వాహన ఉత్సవాన్ని రద్దు చేశారు. కృష్ణానదిలో వాటర్ లెవల్స్ ఎక్కువగా ఉండటంతో పాటు పైనుంచి సుమారు 40 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రవాహం ఉండడంతో నదీ విహారాన్ని రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
దుర్గాఘాట్‌లో గంగా సమేత దుర్గామల్లికార్జునుడికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాగా, కృష్ణా నదికి 40,616 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ప్రస్తుతం వస్తుండడంతో ఇప్పటికే ప్రకాశం బ్యారేజీ వద్ద 25 గేట్లను అడుగు మేర పైకెత్తారు.
దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో తెప్పోత్సవ నిర్వహణ సాధ్యపడడం లేదు. తెప్పోత్సవం కోసం ఇప్పటికే హంస వాహనాన్ని సిద్ధంచేసి, దాన్ని దుర్గాఘాట్ వద్ద ఉంచినప్పటికీ వాటర్ లెవల్స్ ఎక్కువగా ఉండటంతో ఈ ఉత్సవాన్ని రద్దు చేశారు.
కృష్ణానదికి ఎలాంటి ఇన్‌ఫ్లో లేకపోతేనే ఈ ఉత్సవ నిర్వహణకు జలవనరుల శాఖ అనుమతి ఇస్తుంది. ఒకవేళ ఇన్‌ఫ్లో ఉంటే 10 వేల క్యూసెక్కులలోపు మాత్రమే ఉండాలి. దసరా నాటికి తగ్గుతుందని భావించినప్పటికీ అది తగ్గలేదు.
జెషోరేశ్వరీ ఆలయంలోని కాళీమాత విగ్రహానికి మోదీ ఇచ్చిన కిరీటం చోరీ.. వీడియో