TS congress : రేవంత్ రెడ్డి ఖమ్మం టూర్ తో జిల్లా కాంగ్రెస్ లో మరింతగా పెరిగిన విభేధాలు

తెలంగాణలో రాహుల్ గాంధీ సభ జరుగనున్న క్రమంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఖమ్మంలో పర్యటించారు. ఆయన పర్యటనతో జిల్లా కాంగ్రెస్ లో విభేధాలు మరింతగా పెరిగాయి.

TS congress : రేవంత్ రెడ్డి ఖమ్మం టూర్ తో జిల్లా కాంగ్రెస్ లో మరింతగా పెరిగిన విభేధాలు

Ts Congress

Updated On : April 29, 2022 / 11:07 AM IST

TS congress : అసలు.. మీరు ఖమ్మంలో గుమ్మంలో ఎందుకు అడుగుపెట్టారు? వచ్చిన పని పక్కనబెట్టి.. సంబంధం లేని విషయాలెందుకు మాట్లాడారు? అయినా.. మీరొచ్చింది దేనికోసం? రాహుల్ గాంధీ సభకు.. సన్నాహక సమావేశం పెట్టేందుకు! మరి.. మీరు చేసిందేంటి? మంత్రి పువ్వాడ అజయ్ మీద ఆరోపణలు. విమర్శలు. ఇందులో.. కాంగ్రెస్ కార్యకర్తలకు దిశానిర్దేశం ఎక్కడుంది? ఇది.. నా ఫీలింగ్ కాదమ్మా. ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్తలదే. రేవంత్ టూర్ తర్వాత.. అక్కడి హస్తం పార్టీ కేడర్‌లో.. ఇప్పుడిదే చర్చ వినిపిస్తోంది. వాళ్లలో వాళ్లకు.. దీనిమీదే డిబేట్ నడుస్తోంది.

రేవంత్ రెడ్డి ఖమ్మం టూర్‌తో.. జిల్లా కాంగ్రెస్‌లో ఉన్న విభేదాలన్నీ.. రోడ్డు మీద పడ్డాయ్. పీసీసీ చీఫ్ వర్సెస్.. సీఎల్పీ లీడర్ అన్నట్లుగా కనిపించింది సీన్. వచ్చే నెల ఆరో తేదిన.. వరంగల్‌లో నిర్వహించబోయే రాహుల్ గాంధీ బహిరంగ సభకు.. జనసమీకరణకు సంబంధించి.. నిర్వహించిన సన్నాహక సమావేశం కాస్తా.. రచ్చ రచ్చ అయింది. దీంతో.. ఖమ్మం విషయంలో కాంగ్రెస్ నాయకుల మధ్య ఉన్న ఆధిపత్య పోరు మరోసారి బయటపడింది.

Also read : Covid cases: భారత్‌లో భారీగా పెరిగిన కొవిడ్ కేసులు.. 17వేలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య

ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీపై.. పట్టు సాధించేందుకు ఎవరికి వారే ప్రయత్నం చేస్తున్నారు. పైకి కనిపించేందుకు నేతలంతా ఒక్కటే అనుకునేలా ఉంటారు. కానీ.. ఎవరి ప్రయోజనాలు వారివే అన్నట్లుంటుంది గ్రౌండ్ లెవెల్‌లో పరిస్థితి. భట్టి విక్రమార్కకు, రేవంత్‌కు మధ్య సఖ్యత లేదని చెప్పడానికి.. మరో ఎగ్జాంపులే ఖమ్మం కాంగ్రెస్ ఆఫీసులో జరిగిన రచ్చ. అయితే.. రాహుల్ సభకు సంబంధించి.. కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు ఖమ్మం వెళ్లిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. అక్కడ మంత్రి పువ్వాడ అజయ్‌పై ఆరోపణలు గుప్పించి.. విమర్శలు సంధించి.. కొత్త చర్చకు తెరలేపారు. దీనికి.. మంత్రి పువ్వాడ కూడా అదే రేంజ్‌లో కౌంటర్ ఇచ్చారు. అయితే.. ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్తలకు ఇదొక్కటే కాస్త కన్ఫ్యూజింగ్‌గా అనిపిస్తోంది. రేవంత్ రెడ్డి ఎందుకోసం ఖమ్మం వచ్చారు? రాహుల్ సభకు సంబంధించి.. కార్యకర్తలకు ఆయన చేసిన దిశానిర్దేశమేంటి? ఆయనెందుకొచ్చారు? ఎందుకు వెళ్లారో అర్థం కావడం లేదని.. కార్యకర్తల్లో గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఇవన్నీ చూసి.. ఇక కాంగ్రెస్ లీడర్లు మారరు.. పార్టీ బాగుపడదని.. వాళ్ల మీద వాళ్లే జాలి పడుతున్నారని.. స్థానికంగా చర్చించుకుంటున్నారు.

రాహుల్ గాంధీ సభ ఏమో గానీ.. కాంగ్రెస్‌లో బహిర్గతంగా ఉన్న అంతర్గత విభేదాలు.. మరోసారి బహిర్గతమై.. అంతర్గతంగా పరిస్థితి ఏమీ మారలేదని.. ఖమ్మం సీన్‌తో తేలిపోయిందంటున్నారు. ఈ విభేదాలు, ఆధిపత్య పోరు చూసి.. కరడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చెంది.. ఆవేదనకు గురై.. అయోమయంలో పడిపోతున్నారు. పార్టీని.. జెండాను కాపాడుకునేందుకు.. తామంతా గ్రామాల్లో కష్టపడుతుంటే.. నాయకులు మాత్రం వర్గాలుగా విడిపోయి.. పార్టీ మరింత బలహీనంగా మార్చేస్తున్నారని.. వాళ్లలో వాళ్లే చర్చించుకుంటున్నారు.

Also read : Telangana Corona Update : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..

ఇక.. ఖమ్మంకు రేవంత్ రెడ్డి రాకను.. భట్టి అనుచరులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. కార్యకర్తలతో మమేకమై పనిచేస్తుంటే.. రేవంత్, రేణుకా చౌదరి.. వారి మధ్య కూడా విభేదాలు సృష్టిస్తన్నారని భట్టి వర్గం ఆవేదన చెందుతోంది. రేవంత్, రేణుకా ఒక్కటై.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండేవారిని కూడా ప్రోత్సహిస్తూ.. విజిటింగ్ టూర్స్ వేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇలాగైతే.. జిల్లాలో కాంగ్రెస్‌కు కాలం చెల్లిపోతుందని.. చెబుతున్నారు.