ప్లాస్మా పేరుతో దోచుకుంటున్న బ్లడ్ బ్యాంకులు..రూ.8 వేలు విలువ చేసే ప్లాస్మాకు రూ.18 వేలు వసూలు

ప్లాస్మా పేరుతో దోచుకుంటున్న బ్లడ్ బ్యాంకులు..రూ.8 వేలు విలువ చేసే ప్లాస్మాకు రూ.18 వేలు వసూలు

Updated On : December 18, 2020 / 3:04 PM IST

Plasma scam at Sreebalaji Blood Bank : ప్లాస్మా పేరుతో బ్లడ్‌ బ్యాంకులు మోసాకు పాల్పడుతున్నాయి. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగి బంధువులు ప్లాస్మా కోసం నల్లగొండ క్రాస్‌ రోడ్స్‌లోని శ్రీ బాలాజీ బ్లడ్‌ బ్యాంక్‌ను సంప్రదించారు.

18 వేల రూపాయలు తీసుకుని ప్లాస్మా అందచేసిన బ్లడ్‌ బ్యాంక్‌.. డోనర్‌ వివరాలు ఇవ్వకపోవడంపై రోగి బంధువులు చాదర్‌ఘాట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఐజీఎం అనే రిపోర్టు లేదని ఐజీజీ ఉన్నదని నిర్వహకులు చెబుతున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. శాంపిల్స్ కు సంబంధించి హెచ్ఐవీ, వీడీఆర్ఎల్ ఏమైనా రోగాలున్నాయన్నదానికి సంబంధించి చెక్ చేసి స్లిప్ ఉంచుతామని..ఆ స్లిప్ పై నెగెటివ్ అని ఉంటుందని చెబుతున్నట్లు పేర్కొన్నారు.

హెచ్ఐవీ1, హెచ్బీహెచ్ సీ, వీడీఆర్ఎల్ నెగెటివ్ అని ఉంటేనే తాము శాంపిల్స్ ఉంచుకుంటామని నిర్వహకులు తెలిపారు. వాటిపై తాము పరిశీలించినట్లు రిజిస్టర్ లో రాసి ఉంటుందని నిర్వహకులు చెబుతున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.