Modi – Rahul Gandhi : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ ఏమన్నారంటే!

తెలంగాణతో తమ బంధం విడదీయరానిదని పేర్కొన్నారు. ప్రజల కోసం తాము పని చేస్తూనే ఉంటామని పేర్కొన్నారు.

Modi – Rahul Gandhi : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ ఏమన్నారంటే!

PM Modi and Rahul Gandhi

Modi and Rahul Gandhi React : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన ప్రధాని మోదీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. తెలంగాణలో బీజేపీకి ప్రజలు ఇచ్చిన మద్దతుకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా తమకు మద్దతు పెరుగుతూనే ఉందన్నారు. ఈ సరళి రాబోయే కాలంలో కూడా కొనసాగుతుందని తెలిపారు. తెలంగాణతో తమ బంధం విడదీయరానిదని పేర్కొన్నారు. ప్రజల కోసం తాము పని చేస్తూనే ఉంటామని పేర్కొన్నారు. ప్రతి బీజేపీ కార్యకర్త చేసిన అపార కృషిని తాను అభినందిస్తున్నానని వెల్లడించారు.

బీజేపీకి మద్దతుగా నిలిచిన ప్రజలకు కృతజ్ఞతలు : అమిత్ షా

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. బీజేపీకి మద్దతుగా నిలిచిన తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధికి కృషి బీజేపీ చేస్తూనే ఉంటుందన్నారు. ప్రజల మద్దతుతో కచ్చితంగా తెలంగాణను సంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. బీజేపీ కార్యకర్తలు, కిషన్ రెడ్డి అవిశ్రాంత కృషికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

Purandeswari : రాబోయే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ జెండా ఎగురవేస్తాం : పురంధేశ్వరి

తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తాం : రాహుల్ గాంధీ

నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలపై రాహుల్ గాంధీ స్పందించారు. మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, రాజస్థాన్ ప్రజల తీర్పును స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. భావజాలంపై తమ పోరు కొనసాగుతోందన్నారు. ఈమేరకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తామని చెప్పారు. పార్టీ కోసం పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వారందరికీ ధన్యవాదాలు : మల్లికార్జున ఖర్గే

కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నందుకు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధన్యవాదాలు తెలిపారు. చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. మూడు రాష్ట్రాలలో తమ పనితీరు నిస్సందేహంగా నిరుత్సాహపరిచిందన్నారు. కానీ, దృఢ నిశ్చయంతో, ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మించుకోవడానికి పునరుద్ధరించడానికి తమ దృఢ సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తున్నామని తెలిపారు.

నాలుగు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఉత్సాహంగా పోరాడిందన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను అభినందిస్తున్నానని చెప్పారు. తాత్కాలిక ఒడిదుడుకులను అధిగమించి, ఇండియా కూటమి పార్టీలతో కలిసి రాబోయే లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతామని తెలిపారు.