Bandi Sanjay : బండి సంజయ్‌తో మాట్లాడిన ప్రధాని మోదీ

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌ చేశారు. పోలీసులు అరెస్ట్ చేయడం, ఎంపీ కార్యాలయంపై దాడి.. వంటి అంశాలను మోదీ అడిగి తెలుసుకున్నారు.

Bandi Sanjay : బండి సంజయ్‌తో మాట్లాడిన ప్రధాని మోదీ

Bandi Sanjay

Updated On : January 8, 2022 / 9:28 PM IST

Bandi Sanjay : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌ చేశారు. గత కొద్దిరోజులుగా తెలంగాణలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు.. అరెస్టులు, కార్యకర్తలపై కేసులు వంటి వాటిపై మోదీతో మాట్లాడారు బండి. పోలీసులు అరెస్ట్ చేయడం, ఎంపీ కార్యాలయంపై దాడి.. వంటి అంశాలను మోదీ అడిగి  తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. ‘తెలంగాణలో బీజేపీ బలపడుతోందని.. అందుకే తనపై దాడి చేయించారని’ మోదీ దృష్టికి తీసుకెళ్లారు.

చదవండి : Bandi Sanjay Released: జైలు నుంచి విడుదలైన బండి సంజయ్.. కేసీఆర్‌కు కృతఙ్ఞతలు

ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇబ్బందిగా మారిన 317 జీఓ పై గట్టి పోరాటం చేస్తున్నామని చెప్పారు. బండి సంజయ్‌ కుటుంబ సభ్యులను ధైర్యంగా ఉండమని చెప్పారు. ప్రజాస్వామ్య పద్దతిలో పోరాటం చేయండని, జాతీయ నాయకుల మద్దత్తు ఎప్పటికీ ఉంటుందని మోదీ సంజయ్‌కి భరోసా ఇచ్చారు. ఇదే స్ఫూర్తితో పోరాడాలంటూ సంజయ్‌కి మోదీ సూచించారు. ఈ సందర్భంగా మోదీ.. దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికల విజయాల గురించి సంజయ్‌తో చర్చించారు.

చదవండి : Bandi Sanjay: బండి సంజయ్‌ని రిలీజ్ చేయండి.. జైళ్ల శాఖకు హైకోర్టు ఆదేశం