PM Modi : నేడు పాలమూరులో ప్రధాని మోదీ పర్యటన.. రూ.13,545 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

కాచిగూడ, రాయిచూర్ మధ్య డెమో రైలును ప్రారంభించబోతున్నారు. ఇక మరోవైపు రూ.6,6404కోట్ల విలువైన జాతీయ రహదారులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు.

PM Modi : నేడు పాలమూరులో ప్రధాని మోదీ పర్యటన.. రూ.13,545 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

Modi Telangana Tour

PM Modi – Telangana Tour : వచ్చే ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ తెలంగాణపై ఫోకస్ పెట్టింది. ప్రధాని మోదీ ఇవాళ (ఆదివారం) తెలంగాణలో పర్యటించబోతున్నారు. పాలమూరు ప్రజా గర్జన సభలో పాల్గొంటారు. రూ.13,545 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. రూ.505 కోట్లతో నిర్మించిన జక్లేర్ – కృష్ణా కొత్త రైల్వే లైన్ ను జాతికి అంకితం చేస్తారు. ఈ కొత్త రైల్వే లైన్ ద్వారా హైదరాబాద్, గోవా మధ్య 102 కిలో మీటర్ల దూరం తగ్గబోతుంది.

కాచిగూడ, రాయిచూర్ మధ్య డెమో రైలును ప్రారంభించబోతున్నారు. ఇక మరోవైపు రూ.6,6404కోట్ల విలువైన జాతీయ రహదారులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు. రూ.2,455 కోట్లతో నిర్మించిన ఖమ్మం – సూర్యపేట నాలుగు లేన్ల రహదారిని ప్రారంభిస్తారు. రూ.2,661 కోట్లతో కర్ణాటక నుంచి చర్లపల్లి వరకు నిర్మించిన గ్యాస్ పైప్ లైన్ ను జాతికి అంకితం చేయనున్నారు.

Carpooling : కార్‌పూలింగ్‌పై నిషేధం…బెంగళూరు రవాణశాఖ సంచలన నిర్ణయం

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రూ.81 కోట్లతో నిర్మించిన నూతన భవనాలను వర్చువల్ గా ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రధాని మోదీ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో మహబూబ్ నగర్ కు బయల్దేరుతారు. మధ్యాహ్నం 2.10 గంటలకు మహబూబ్ నగర్ హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు.

మధ్యాహ్నం 2.15 గంటల నుంచి 45 నిమిషాల పాటు మహబూబ్ నగర్ లో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ వేదికకు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ సభ వద్దే ప్రధాని మోదీ ఉంటారు. అనంతరం మహబూబ్ నగర్ నుంచి శంషాబాద్ బయల్దేరుతారు. అనంతరం సాయంత్రం 4.50 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ప్రధాని మోదీ ఢిల్లీ వెళ్లబోతున్నారు.