తెలంగాణలో ప్రధాని మోదీ షెడ్యూల్ ఖరారు.. 3 రోజుల పర్యటనలో బహిరంగ సభల్లో పాల్గొనే అవకాశం!
PM Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ మేరకు మోదీ షెడ్యూల్ పర్యాటన ఖరారు అయింది. మార్చి 16 నుంచి 18,19వ తేదీల్లో మోదీ పర్యటించనున్నారు.

PM Narendra Modi
PM Narendra Modi : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. తెలంగాణ రాష్ట్రంలో భారీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రచారాన్ని వేగవంతం చేసింది. ఇప్పటికే, రాష్ట్రంలో బీజేపీ అగ్రనేతలు పర్యటించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు.
Read Also : Telangana Cabinet Decisions : త్వరలో కొత్త రేషన్ కార్డులు.. క్యాబినెట్ కీలక నిర్ణయాలు
ఈ మేరకు మోదీ షెడ్యూల్ పర్యాటన ఖరారు అయింది. మార్చి 16 నుంచి 18,19వ తేదీల్లో మోదీ పర్యటించనున్నారు. 3 రోజుల పర్యటనలో భాగంగా మోదీ మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, జగిత్యాల బహిరంగ సభల్లో పాల్గొనే అవకాశముందని తెలంగాణ బీజేపీ నేతలు వెల్లడించారు.
మల్కాజ్‌గిరిలో భారీ బహిరంగ సభ :
ఈ నెల15 న మల్కాజ్ గిరిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. హైదారాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరీ పార్లమెంట్ స్థానాలు కలిపి మల్కాజిగిరీలో సభను నిర్వహించనున్నారు. మార్చి 16న మహబూబ్ నగర్, నల్లగొండ, నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానాలు కలిపి నాగర్ కర్నూల్‌లో సభ, మార్చి 18న జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ కలిపి జగిత్యాల వేదికగా బహిరంగ సభను నిర్వహించనున్నారు.
ఇప్పటికే, తెలంగాణలో ఈనెల 4, 5 తేదీల్లో మోదీ పర్యటించిన సంగతి తెలిసిందే. రెండు రోజుల పాటు పర్యటనలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలోని అనేక సభల్లో మోదీ పాల్గొన్నారు.
Read Also : CM Revanth Reddy : మళ్లీ ఢిల్లీకి సీఎం రేవంత్.. రెండో జాబితా ఎంపీ అభ్యర్థులపై అధిష్టానంతో చర్చ