Narendra Modi: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణకు మోదీ.. షెడ్యూల్ ఇదే..

ఇప్పటికే తెలంగాణ నుంచి 9మంది అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Narendra Modi: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణకు మోదీ.. షెడ్యూల్ ఇదే..

PM Modi

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ టూర్ ఆసక్తి రేపుతోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారి రాష్ట్ర పర్యటనకు వస్తున్న మోదీ రాజకీయంగా ఎలాంటి ప్రసంగం చేయబోతున్నారనేది ఉత్కంఠగా మారింది. గత పర్యటనలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడిన నరేంద్రమోదీ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తారా లేదా బీఆర్ఎస్ ను సైతం కలిపి విమర్శలు చేస్తారా అనేది పొలిటికల్ గా చర్చ నడుస్తుంది.

దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కాస్త కాంగ్రెస్ బలంగా ఉంది. ఈ నేపథ్యంలో నరేంద్రమోదీ రాజకీయ వేదికపై చేసే కామెంట్స్ ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తిగా మారింది. సోమవారం ఉదయం 9.20 గంటలకు ప్రత్యేక విమానంలో నాగ్‌పూర్ చేరుకుంటారు నరేంద్ర మోదీ.

అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ల ద్వారా ఉదయం 10.20 గంటలకు ఆదిలాబాద్ కు చేరుకొని..30 నిమిషాల పాటు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 6వేల 697 కోట్ల విలువైన పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేయనున్నారు. రామగుండం NTPCలో 6వేల కోట్లతో నిర్మించిన రెండో థర్మల్ పవర్ యూనిట్ ను జాతికి అంకితం చేస్తారు. 70 కోట్లతో నిర్మించిన అంబారి – ఆదిలాబాద్ – పింపాలకుట్టి రైల్వే లైన్ విద్యుదీకరణను ప్రారంభిస్తారు.

వీటితో పాటు 491 కోట్లతో ఆదిలాబాద్- బేలా మధ్య NH-353Bపై చేపట్టనున్న 2 లైన్స్ నేషనల్ హైవే విస్తరణకు శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా 136 కోట్లుతో చేపట్టనున్న NH-163 పై హైదరాబాద్ – భూపాలపట్నం రోడ్డుకుభూమిపూజ చేయనున్నారు.

బహిరంగ సభ
ఉదయం 11 గంటల నిమిషాల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పార్టీ పరంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఇప్పటికే తెలంగాణ నుంచి 9మంది అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. పది రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఐదు క్లస్టర్ గా బస్సు యాత్రను పూర్తి చేసింది. ఈ సందర్భంలో ఆదిలాబాద్ వేదికగా ప్రధాని ఎలాంటి కామెంట్స్ చేయబోతున్నారన్నది ఆసక్తిగా మారింది.

ఆదిలాబాద్ పర్యటన తర్వాత తమిళనాడుకు వెళ్లనున్నారు నరేంద్రమోదీ. చెన్నైలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొని..రాత్రి 7.45 ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకుంటారు. రేపు రాత్రి 8గంటల హైదరాబాద్ చేరుకొని రాజ్ భవన్ లో బసచేస్తారు మోదీ. మంగళవారం ఉదయం సంగారెడ్డిలో పర్యటిస్తారు ప్రధాని. సంగారెడ్డిలో 9వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. మొదట బేగంపేట ఎయిర్ పోర్టులో4వందల కోట్లతో నిర్మించిన పౌరవిమానయాన పరిశోధనా సంస్థను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు ప్రధాని.

CM Revanth Reddy: ఇది మన మనుగడకు, గుర్తింపునకు మంచి పరిణామం కాదు: రేవంత్ రెడ్డి