Telangana BJP : దూకుడు పెంచిన బీజేపీ.. రంగంలోకి ఎన్నికల కమిటీ సభ్యులు.. మోదీ రాకతో మరింత జోష్

తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఎన్నిక సంఘం కసరత్తు చేస్తోంది. దీంతో ఎన్నికల రణరంగంలోకి దిగేందుకు పార్టీలు సిద్ధమయ్యాయి.

Telangana BJP : దూకుడు పెంచిన బీజేపీ.. రంగంలోకి ఎన్నికల కమిటీ సభ్యులు.. మోదీ రాకతో మరింత జోష్

PM Narendra Modi

PM Narendra Modi Telangana Tour : తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఎన్నిక సంఘం కసరత్తు చేస్తోంది. దీంతో ఎన్నికల రణరంగంలోకి దూకేందుకు పార్టీలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గాల వారిగా అభ్యర్థులనుసైతం ప్రకటించింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం మేమే అని చెబుతున్న బీజేపీ.. వచ్చే ఎన్నికల్లో సత్తాచాటేందుకు ప్రయత్నిస్తోంది. ఆ పార్టీ జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు వ్యూహాలకు పదును పెడుతున్నారు. అక్టోబర్ 1నుంచి అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు అమలు చేయాల్సిన కార్యక్రమాలు, ప్రజలను బీజేపీవైపుకు ఆకర్షించేలా చేపట్టాల్సిన చర్యలపై ఆ పార్టీ నేతలు దృష్టిపెట్టారు.

Read Also: PM Modi : నేడు పాలమూరులో ప్రధాని మోదీ పర్యటన.. రూ.13,545 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

అగ్రనేతల వరుస పర్యటనలు..
అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ అగ్రనాయకత్వం రంగంలోకి దిగుతోంది. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు జాతీయ స్థాయి నేతలు తెలంగాణ రాష్ట్రంలో వరుస పర్యటనలు చేయనున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. పాలమూరు ప్రజాగర్జన సభ ద్వారా ఎన్నికల ప్రచారానికి నాందిపలకబోతున్నారు. ఈనెల 3వ తేదీనకూడా మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో పర్యటిస్తారు. బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు రాష్ట్రంలో ప్రచారంలో పాలు పంచుకోనున్నారు. 6న హైదరాబాద్‌లో జరిగే విస్తృత స్థాయి సమావేశంలో పదాధికారులు, జిల్లాల అధ్యక్షులు, అనుబంధ విభాగాల వారికి నడ్డా దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటి నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు చేపట్టాల్సిన కార్యక్రమాలను నడ్డా పార్టీ నేతలకు వివరించనున్నారు. అంతేకాక, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నడ్డా పార్టీ నేతలకు సూచించనున్నారు.

Read Also : Telangana BJP : గోడ దూకేస్తారా? తెలంగాణ బీజేపీలో దుమారం, పార్టీని హడలెత్తిస్తున్న ఆ నలుగురు సీనియర్లు

రంగంలోకి రాష్ట్ర ఎన్నికల కమిటీ సభ్యులు..
అసెంబ్లీ ఎన్నికలు మరో రెండు నెలల్లో జరిగే అవకాశం ఉండటంతో బీజేపీ అధిష్టానం అప్రమత్తమైంది. ఇప్పటికే బీజేపీ 26 మందితో రాష్ట్ర ఎన్నికల కమిటీని నియమించింది. వీరిలో కొందరు శుక్రవారమే హైదరాబాద్ చేరుకున్నారు. ఇటీవల రాష్ట్రంలో వారంరోజుల పాటు నియోజకవర్గాల్లో పర్యటించిన ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలు ఇచ్చిన నివేదికల ఆధారంగా ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితిని చక్కదిద్దడంపై ఈ కమిటీ, రాష్ట్ర పార్టీ నాయకత్వం దృష్టిపెట్టనుంది. మరోవైపు సామాజిక మాధ్యమాల వాడకం, అధికార ప్రతినిధుల విధుల నిర్వహణపై ఇప్పటికే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పలు సార్లు సమావేశమై దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా నియోజకవర్గాల వారిగా అందిన నివేదికల ప్రకారం.. బీజేపీ నేతలు వ్యూహాలను అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.

Read Also : ModiShah Politics: ఆ దెబ్బతో కాంగ్రెసే కాదు, బీజేపీ కూడా దారిలోకి.. గట్టి ప్లానే వేసిన మోదీ-షా

అభ్యర్థుల ఎంపికపై కసరత్తు..
రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గాల వారిగా అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల రణరంగంలోకి దూకేసింది. బీజేపీ అగ్రనాయకత్వంసైతం ఎన్నికల షెడ్యూల్ వెలువడే సమయానికి అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించేందుకు దృష్టిసారించింది. ఇప్పటికే నియోజకవర్గాల వారిగా టికెట్ ఆశిస్తున్న వారినుంచి బీజేపీ అధిష్టానం దరఖాస్తులు స్వీకరించింది. ఆరువేల మందికిపైగా టికెట్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు గట్టిపోటీ ఇచ్చే వారిని గుర్తించి, వారి బలాబలాల ప్రాతిపదికగా, సర్వేల ఆధారంగా టికెట్లు కేటాయించనున్నారు. ఈ క్రమంలో ఈనెల 4, 5 తేదీల్లో దీనిపై పూర్తిస్థాయిలో కసత్తును బీజేపీ అధిష్టానం చేయనుంది.

Read Also : Gold Price Today: మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల గోల్డ్ రేటు ఎంతంటే?

మోదీ రాకతో మరింత జోష్..
మరికొద్ది రోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకోసం బీజేపీ నేతలు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే మండల, గ్రామ, బూత్‌ స్థాయిల వారిగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ 1, 3 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనుండటం ఆ పార్టీ శ్రేణుల్లో మరింత జోష్‌ను నింపనుంది. ఆదివారం రాష్ట్రంలో పర్యటించనున్న మోదీ.. సాయంత్రం 4గంటలకు జరిగే పాలమూరు ప్రజాగర్జన సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. 3వ తేదీన నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తారు. అక్కడ జరిగే సభలో మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. ఈ రెండు సభల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు లక్ష్యంగా మోదీ ప్రసంగం ఉంటుందని సమాచారం. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల కోసం సమాయత్తం అవుతున్న బీజేపీ శ్రేణుల్లో మోదీ పర్యటన మరింత జోష్ ను నింపడం ఖాయంగా కనిపిస్తోంది.