Fake Bus Pass: నకిలీ బస్ పాసులు సృష్టించి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

నకిలీ బస్ పాసులు సృష్టించి.. భారీగా ఆర్టీసీ ఆదాయానికి గండి కొడుతున్న ఇద్దరు వ్యక్తులను హుస్నాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Fake Bus Pass: నకిలీ బస్ పాసులు సృష్టించి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

Police

Updated On : February 24, 2022 / 8:29 AM IST

Fake Bus Pass: నకిలీ బస్ పాసులు సృష్టించి.. భారీగా ఆర్టీసీ ఆదాయానికి గండి కొడుతున్న ఇద్దరు వ్యక్తులను హుస్నాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. హుస్నాబాద్ ఎస్సై శ్రీధర్ తెలిపిన వివరాలు మేరకు..సిద్ధిపేట ఆర్టీసీ డిపో పరిధిలో నకిలీ బస్ పాసులు చలామణిలో ఉన్నాయంటూ జనవరి 3న ఆర్టీసీ అధికారులు హుస్నాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంత దర్యాప్తు చేసినా నకిలీ పాసులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే విషయాన్ని మాత్రం పోలీసులు గుర్తించలేకపోయారు. కేసును సవాలుగా తీసుకున్న హుస్నాబాద్ ఎస్సై శ్రీధర్ ముమ్మర దర్యాప్తు అనంతరం..బోయిని కనకయ్య, సంజీవ్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ నకిలీ పాసులు తయారు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

Also read: Madhapur Rape : మాదాపూర్‌లో దారుణం.. ప్రియురాలిపైనే అత్యాచారం, హత్య

నిందితులిద్దరు కరీంనగర్ కు చెందిన వారు. వీరిలో బోయిని కనకయ్య దివ్యాంగుడు. తనకున్న సదరం సర్టిఫికెట్ ను ఉపయోగించి..తన బస్ పాస్ పోయిందంటూ అబద్దం చెప్తూ వేర్వేరు బస్ డిపోల్లో బస్ పాసులు తీసుకునేవాడు. అనంతరం వాటిని కరీంనగర్ లో ఉన్న సంజీవ్ కు ఇవ్వగా.. అతను కంప్యూటర్ ద్వారా ఆ పాసులకు నకిలీవి సృష్టించేవాడు. వీరిద్దరూ ఇలా అనేక నకిలీ బస్ పాసులు సృష్టించి అమ్ముకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈమేరకు బుధవారం హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్సై శ్రీధర్ మాట్లాడుతూ కేసు వివరాలు వెల్లడించారు. నిందితులను అదుపులోకి తీసుకుని వారిని రిమాండ్ కు తరలించామని, వారి నుంచి కంప్యూటర్, సీపీయూ, ప్రింటర్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై శ్రీధర్ పేర్కొన్నారు.

Also read: RBI Alert : మీ ఫోన్లో ఈ లోన్ యాప్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి.. ఆర్‌బీఐ హెచ్చరిక!