Madhapur Rape : మాదాపూర్‌లో దారుణం.. ప్రియురాలిపైనే అత్యాచారం, హత్య

మాదాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించిన యువ‌తిపైనే ప్రియుడు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఆపై ఆమెను హ‌త్య చేశాడు.

Madhapur Rape : మాదాపూర్‌లో దారుణం.. ప్రియురాలిపైనే అత్యాచారం, హత్య

Rape

Madhapur Rape : హైద‌రాబాద్‌లోని మాదాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించిన యువ‌తిపైనే ప్రియుడు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఆపై ఆమెను హ‌త్య చేశాడు. త‌న‌ను ప్రేమించిన యువ‌తి.. వేరే యువ‌కుడితో స‌న్నిహితంగా తిరుగుతోంద‌న్న కార‌ణంతో ప్రియుడు ఆమెపై ఈ దారుణానికి ఒడిగ‌ట్టాడు. సమాచారం అందుకున్న వెంట‌నే రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

హైటెక్ సిటీ ఔట్ పోస్ట్ దగ్గర ఈ ఘటన జరిగింది. లాలూ ప్ర‌సాద్ అనే యువ‌కుడు యువ‌తిని ప్రేమించాడు‌. అయితే స‌ద‌రు యువ‌తి న‌రేష్ అనే యువ‌కుడితో తిరుగుతోందని‌ గ‌మ‌నించిన లాలూ ప్ర‌సాద్‌ కోపంతో ఊగిపోయాడు. త‌న‌ను ప్రేమించి మరొకరితో ఎలా తిరుగుతావ్ అంటూ బాధితురాలిపై క‌క్ష పెంచుకున్నాడు.

Extra Marital Affair : భార్య ప్రవర్తనపై అనుమానం…అత్త,భార్యను నరికి చంపిన వ్యక్తి

ఈ క్ర‌మంలో ఆమెను అంత‌మొందించాల‌ని ప‌థ‌కం వేసుకున్న లాలూ ప్ర‌సాద్‌.. యువ‌తిని హైటెక్ సిటీ ఔట్ పోస్టు దగ్గరికి పిలిపించాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. అనంతరం హ‌త్య చేశాడు. పోలీసుల విచారణలో అతడు నేరాన్ని ఒప్పుకున్నాడు.

Gang Rape In Telangana : మహబూబాబాద్ జిల్లాలో గ్యాంగ్ రేప్

ఈ కేసులో పోలీసులు నిందితుడిని సీసీటీవీ కెమెరా ఫుటేజీ ఆధారంగా అరెస్ట్‌ చేశారు. తనతో కాకుండా నరేష్‌ అనే యువకునితో సన్నిహితంగా ఉంటుందనే అక్కసుతోనే తను ఆమెను అత్యాచారం చేసి.. హత్య చేసినట్లు పోలీసులు ముందు లాలుప్రసాద్‌ ఒప్పుకున్నాడు.