High Court : వాహనాలు సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
డ్రంకెన్ డ్రైవ్ కేసుల విధివిధానాలపై తెలంగాణ హైకోర్టు పోలీసులకు దిశానిర్దేశం చేసింది. మద్యం తాగి నడిపిన వారి వాహనాలు సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది.

High Court
High Court : డ్రంకెన్ డ్రైవ్ కేసుల విధివిధానాలపై తెలంగాణ హైకోర్టు పోలీసులకు దిశానిర్దేశం చేసింది. మద్యం తాగి నడిపిన వారి వాహనాలు సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఓ వాహనదారు మద్యం తాగినట్టు తేలితే, ఎట్టిపరిస్థితుల్లోనూ అతడిని వాహనం నడిపేందుకు అనుమతించరాదని స్పష్టం చేసింది. అతడి వెంట ఎవరూ లేని పరిస్థితుల్లో సన్నిహితులను పిలిపించి వాహనం అప్పగించాలని ఆదేశించింది.
Third-Party Apps : మీ గూగుల్ అకౌంట్లో థర్డ్ పార్టీ యాప్స్ యాక్సస్ ఆపేయండిలా!
ఒకవేళ మద్యం తాగిన వ్యక్తి తరఫున ఎవరూ రాకపోతే ఆ వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించాలని, తర్వాత వాహనాన్ని అప్పగించాలంది. అతడి వెంట మద్యం తాగని వ్యక్తి ఉంటే అతడికి వాహనం ఇవ్వొచ్చని వెల్లడించింది. అంతేతప్ప, మద్యం మత్తులో డ్రైవ్ చేసే వారి వాహనాలను సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది.
EPFOలో వడ్డీ జమ అవుతుందో లేదో తెలుసా? మీ పాస్‌బుక్ చెక్ చేసుకోండిలా!
ప్రాసిక్యూషన్ అవసరమైన కేసుల్లో 3 రోజుల్లో ఛార్జిషీట్ వేయాలని కోర్టు సూచించింది. ప్రాసిక్యూషన్ పూర్తయ్యాక వాహనం అప్పగించాలంది. వాహనం కోసం ఎవరూ రాకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆదేశాలు అమలు చేయని పోలీసులపై కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవని హైకోర్టు తన ఆదేశాల్లో తెలిపింది. కోర్టు ఆదేశాలతో సీజ్ చేసిన వాహనాల కోసం మందుబాబులు ఇక నుంచి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పనిలేదు.