Raja Singh: ఒంటరిగా తిరగొద్దు.. ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పోలీసుల నోటీసులు..

ఈ మేరకు రాజాసింగ్ కు నోటీసులు ఇచ్చారు మంగళహాట్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ మహేశ్.

Raja Singh: ఒంటరిగా తిరగొద్దు.. ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పోలీసుల నోటీసులు..

Updated On : June 1, 2025 / 10:38 PM IST

Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఒంటరిగా తిరగొద్దని నోటీసుల్లో పేర్కొన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రభుత్వం ఇచ్చిన భద్రతా సిబ్బందిని, బుల్లెట్ ప్రూఫ్ కారును వాడుకోవాలని రాజాసింగ్ ను కోరారు పోలీసులు. భద్రతా కారణాల రీత్యా ఒంటరిగా తిరగొద్దని రాజాసింగ్ కు సూచించారు.

ప్రభుత్వం ఇస్తున్న 1+4 భద్రతా సిబ్బందిని వినియోగించుకోవాలని రాజాసింగ్ కు చెప్పారు. ఈ మేరకు రాజాసింగ్ కు నోటీసులు ఇచ్చారు మంగళహాట్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ మహేశ్. కాగా, నిన్న తన భద్రతా సిబ్బందిని వదిలి పెట్టి రాజాసింగ్ తన బైక్ పై ఓల్డ్ సిటీలో తిరిగారు. దీంతో పోలీసులు స్పందించారు. సెక్యూరిటీ లేకుండా తిరగవద్దంటూ రాజాసింగ్ కు నోటీసులు ఇచ్చారు.

 

గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆదివారం పాతబస్తీ ప్రాంతంలో బైక్ పై ప్రయాణించారు. ఆవులు, ఎద్దుల దృశ్యాలను స్వయంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పార్లమెంటరీ నియోజకవర్గంలో బక్రీద్ సందర్భంగా వధ కోసం ఆవు దూడలను అక్రమంగా విక్రయిస్తున్న దృశ్యాలను ప్రజలు, ప్రభుత్వం ముందుంచుతున్నానని తెలిపారు. ”హిందువులకు పవిత్రమైన ఆవు దూడలను బక్రీద్ సందర్భంగా వధ కోసం అమ్ముతున్నారు. ఇది జంతు సంరక్షణ చట్టాలను స్పష్టంగా ఉల్లంఘించడమే. సుప్రీంకోర్టు ఆదేశాలను భేఖాతరు చేయడమే” అని రాజాసింగ్ అన్నారు.

Also Read: సై అంటే సై.. అభయ్ పటేల్, పొంగులేటి మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం..! బీజేపీ వర్క్ షాప్‌లో రచ్చరచ్చ..!

ఇప్పటికైనా ప్రభుత్వాలు, పోలీస్ శాఖ గోవధ నిషేధ చట్టాలు అమలు చేసి గోవధను ఆపాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. తాలాబ్ కట్ట, భవానీ నగర్, చాంద్రాయణగుట్ట, ఇంజన్‌బోలి, బాబా నగర్, బహదూర్‌పురా, సంతోష్ నగర్, యాకుత్‌పురా, గోల్కొండ, జీరా ప్రాంతాల్లో గోవధకు అమ్మకానికి పెట్టిన ఆవులు, ఎద్దులను వీడియోలో చూపించామన్నారు. గోవధ సమస్య జంతు సంక్షేమ చట్టాలను ఉల్లంఘించడమే కాకుండా మత సామరస్యానికి విఘాతం కలిగించేదిగా ఉందన్నారు రాజాసింగ్. మీడియా కూడా ఈ సమస్యపై స్పందించాలని, గోవధ నిషేధానికి సహకరించాలని రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు.