Pudding Mink Pub Case : ఆ నలుగురిపై కేసు.. పరారీలో A3, A4

పుడ్డింగ్ మింక్ పబ్ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న A3, A4 లను పట్టుకునేందుకు..(Pudding Mink Pub Case)

Pudding Mink Pub Case : ఆ నలుగురిపై కేసు.. పరారీలో A3, A4

Pudding Mink Pub Case

Updated On : April 4, 2022 / 6:44 PM IST

Pudding Mink Pub Case : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన హైదరాబాద్ లోని పుడింగ్ మింక్ పబ్ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటివరకు నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అభిషేక్ ఉప్పల్, అనిల్ కుమార్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. A3- అర్జున్ వీరమాచనేని, A4 కిరణ్ రాజులు పరారీలో ఉన్నారు. పబ్ ను 2017లో కిరణ్ రాజు అతని భార్య లీజుకు తీసుకున్నారు.

2020 వరకు భార్యతో కలిసి పబ్ ను నడిపాడు కిరణ్ రాజు. 2020 ఆగస్టులో అభిషేక్ ఉప్పల్, అనిల్ కుమార్ లకు కిరణ్ రాజు పబ్ ని లీజుకిచ్చాడు. 2022 జనవరి నుంచి పబ్ ని అభిషేక్ ఉప్పల్ బిజినెస్ ఆపరేషన్లలోకి తీసుకొచ్చాడు. అభిషేక్ ఉప్పల్ కి పబ్ ఇచ్చినప్పటికీ A4- కిరణ్ రాజు పార్టనర్ గానే కొనసాగాడు. కిరణ్ రాజ్, అర్జున్ మాచినేని ఉండడంతో పోలీస్ కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయడంతో కిరణ్ రాజ్, అర్జున్ మాచినేని పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న ఆ ఇద్దరిని పట్టుకునేందుకు బంజారాహిల్స్ పోలీసులు రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.

హైదరాబాద్‌లో పబ్‌ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. హైదరాబాద్‌ నడిబొడ్డున.. అదీ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో.. కిక్కిచ్చే లిక్కర్‌తో పాటు తిక్క రేపే డ్రగ్స్‌ దొరకడం షాక్‌కు గురిచేస్తోంది. రాడిసన్‌ హోటల్‌లోని పుడ్డింగ్ అండ్ మింక్‌ పబ్‌లో షుగర్‌ క్యాండీలతో పాటే కొకైన్‌ ప్యాకెట్ల అమ్మకాలు కలకలం రేపుతున్నాయి. బయటకు పబ్‌లా కనిపించినా.. అక్కడంతా హైటెక్ వ్యవహారం సాగుతోంది. పోలీసుల విచారణలో.. పబ్‌కు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో FIR నమోదు చేశారు.

Pudding and Mink Pub: పబ్ లో డ్రగ్స్ కేసు విచారణలో విస్తుపోయే విషయాలు: డ్రగ్స్ కోసం ఏకంగా “స్మార్ట్ యాప్”

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మహమ్మద్ హఫీజుద్దీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. రాడిసన్ బ్లూ హోటల్‌లో పుడ్డింగ్ & మింక్ పబ్ పై పోలీసులు దాడి జరిపిన సంగతి తెలిసిందే. హోటల్ 1వ అంతస్తులో ఉన్న పబ్‌కి తెల్లవారుజామున 2 గంటలకు వెళ్లి దాడులు జరిపారు. మహదరం అనిల్ కుమార్, అభిషేక్ వుప్పాల, అర్జున్ వీరమాచినేని (పరారీ), కిరణ్ రాజు (పరారీ) పై కేసు నమోదు చేశారు. ఇప్పటికే అనిల్ కుమార్, అభిషేక్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

ఇక పబ్ నుంచి S-1 బరువు 1 గ్రాము, S-2 బరువు 0.64 గ్రాములు, S-3 బరువు 0.93 గ్రాములు, S-4 1 గ్రాము, S-5 బరువు 1.07 గ్రాములు (మొత్తం – 4.64 గ్రాములు) కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. బార్ కౌంటర్ నుండి స్ట్రాస్, టిష్యూ పేపర్లు, టూత్ పిక్స్‌తో పాటు రెండు కేడీ (ప్లాస్టిక్ ట్రే)లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే DI Samsung Galaxy S22 Ultra Model No.SM-S908E/DS IMEI నం.358624670059471, Apple iPad 5 మోడల్ ఫోన్, ల్యాప్‌టాప్, మినీ-ప్రింటర్, వెయింగ్ మెషీన్, ప్యాకింగ్ మెటీరియల్‌, 216 సిగిరెట్ పీకలు సైతం టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు దాడులు జరిపిన సమయంలో అనిల్ కుమార్ అక్కడే ఉన్నాడని పోలీసులు వెల్లడించారు.

Pudding And Mink Pub : ఫుడ్డింగ్ పబ్ కేసు.. కీలకాంశాలివే, ఇద్దరు పరార్

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్‌లోని పుడ్డింగ్ & మింక్ పబ్‌లో రేవ్ పార్టీ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సినీ, రాజకీయ, వ్యాపార కుటుంబాలకు చెందిన యువతీ యువకులు డ్రగ్స్ సేవిస్తూ పార్టీలో చిందులేస్తుండగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించిన సంగతి తెలిసిందే.

రాడిసన్ బ్లూ హోటల్‌లో ఉన్న పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌పై ఆదివారం తెల్లవారుజామున ఆకస్మికంగా దాడి చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఐదు గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పబ్‌లో పట్టుబడిన వారిని విచారణ అనంతరం వదిలిపెట్టారు. దాడి సమయంలో పబ్‌లో సిబ్బందితో సహా 148 మంది ఉన్నట్టుగా పోలీసులు చెప్పారు. పబ్‌లో జరిగిన లేట్ నైట్ పార్టీలో టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు బంధువులు, వ్యాపారవేత్తల పిల్లలు ఉండటం హాట్ టాపిక్ గా మారింది.

ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు దాడులు నిర్వహించినట్లు వెస్ట్ జోన్ డీసీపీ జోయల్‌ డేవిస్‌ తెలిపారు. సోదాల్లో కొకైన్‌ దొరికిందని వెల్లడించారు. కస్టమర్లందరూ డ్రగ్స్ వాడినట్లు తేలకపోవడంతో వారిని నిందితులుగా చేర్చలేదన్నారు.