CM KCR: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏం జరిగిందో తెలుసా? వీళ్లు ఇప్పుడొచ్చి..: సీఎం కేసీఆర్

తమ పాలనలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకువెళ్తుందని చెప్పారు.

CM KCR: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏం జరిగిందో తెలుసా? వీళ్లు ఇప్పుడొచ్చి..: సీఎం కేసీఆర్

CM KCR

Updated On : August 20, 2023 / 6:48 PM IST

CM KCR: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక బెంగళూరులోనూ విద్యుత్ కోతలు విధించారని, అటువంటి పార్టీ నేతలు ఇప్పుడొచ్చి తెలంగాణలో విద్యుత్ గురించి మాట్లాడుతున్నారని సీఎం కేసీఆర్ విమర్శించారు. సూర్యాపేటలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

తెలంగాణలో ఎన్నికైతే రూ.4 వేల వృద్ధాప్య పింఛన్లు ఇస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని, మరి ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఇటువంటి పథకాలు ఎందుకు లేవని కేసీఆర్ నిలదీశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రతి రాష్ట్రంలో ఒక్కో విధానం చొప్పున ఉంటుందా? అని అన్నారు.

తమ పాలనలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకువెళ్తుందని చెప్పారు. పలు రాష్ట్రాల్లో అసెంబ్లీలు, సెక్రెటేరియట్‌ లూ సరిగ్గా లేవని చెప్పారు. తెలంగాణ ఏర్పడ్డాక రైతుల ఆత్మహత్యలు తగ్గాయని అన్నారు. నల్లగొండ జిల్లా అప్పుడెలా ఉంది? ఇప్పుడెలా ఉంది? అని అడిగారు.

అప్పట్లో రాష్ట్రం ఫ్లోరైడ్‌ తో విలవిల్లాడిపోయిందని, ఇప్పుడు పూర్తిగా ఆ సమస్య తగ్గిపోయిందని అన్నారు. తెలంగాణలో పెన్షన్ పెంచుతామని అన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టాలని, మూడు గంటల కరెంటు అని ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయని చెప్పారు.

ధరణితో కష్టాలు తొలగి పోయాయని, అక్రమాలు జరగడం లేదని కేసీఆర్ అన్నారు. సూర్యాపేట కలెక్టరేట్‌ ప్రారంభోత్సవానికి వెళ్తున్న సమయంలో చూశానని, ఇక్కడ వందలాది కొత్త భవనాలు వచ్చాయని అన్నారు. సూర్యాపేట అభివృద్ధిని కళ్లారా చూశానని చెప్పారు.

Paderu Bus Accident : పాడేరులో ప్రమాదం, 100 అడుగుల లోయలో పడిన ఆర్టీసీ బస్సు.. చెట్టు కొమ్మ ఎంత పని చేసింది