బార్లకు,థియేటర్లు,రెస్టారెంట్లకు లేని అభ్యంతరం స్కూళ్లు తెరవటానికేంటీ?..

Private School Teachers Protest In Hyderabad
Private School Teachers Protest In Hyderabad : మరోసారి కరోనా విజృంభించటంతో తెలంగాణాలో విద్యాసంస్థలన్నీ మూత పడ్డాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో విద్యాసంస్థల్ని మూసివేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు స్కూల్స్ నుంచి కాలేజీల వరకూ అంటే కేజీ టూ పీజీ వరకూ అన్నీ మూతపడ్డాయి.
ఈ క్రమంలో ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు రోడ్డెక్కారు. జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేపట్టాయి. ఈ సందర్బంగా టేస్మ ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కరోనా పేరుతో ప్రైవేటు స్కూళ్లను మూసివేయడం దారుణమని అన్నారు.
సినిమా థియేటర్లు, బార్లను తెరిచే ఉంచారని… దీనివల్ల కరోనా రాదా? అని ప్రశ్నించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆ ప్రాంతాలకు వెళ్లరా? అని నిలదీశారు. ప్రభుత్వ గురుకులాల్లో కరోనా కేసులు వస్తే… శిక్ష తమకెందుకు వేస్తున్నారని మండిపడ్డారు. కరోనా కట్టడి చేయాలనుకుంటే… ప్రతి వ్యవస్థను బంద్ చేయాలని డిమాండ్ చేశారు. అన్ని వ్యవస్థలను తెరిచి ఉంచి, విద్యాసంస్థలను మాత్రమే మూసివేస్తామంటే కుదరదని అన్నారు.