TSRTC : అద్భుతమైన పాట పాడిన ఆర్టీసీ డ్రైవర్..ట్వీట్ చేసిన సజ్జనార్

నాగర్ కర్నూలు జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండల పరిధిలో నాయినిపల్లి మైసమ్మ ఆలయం ఉంది. ఈ టెంపుల్ కు ప్రతి ఆదివారం భక్తులు భారీగా తరలివస్తుంటారు.

TSRTC : అద్భుతమైన పాట పాడిన ఆర్టీసీ డ్రైవర్..ట్వీట్ చేసిన సజ్జనార్

Nagarkurnoo Rtc

Updated On : November 15, 2021 / 7:30 PM IST

TSRTC MD Sajjanar : ఆర్టీసీ సంస్థను గాడిలో పెట్టేందుకు ఎండీ సజ్జనార్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలే పదవి చేపట్టిన ఆయన పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ..దూకుడుగా వెళుతున్నారు. ప్రయాణీకులను ఎలాంటి అసౌకర్యం కలుగకుండా..పలు చర్యలు తీసుకుంటున్నారు. డ్రైవర్లు, కండక్టర్ల విషయంలో సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉదయమే 4 గంటలకు బస్సులు రోడ్లపైకి వస్తాయని ప్రకటించిన ఆయన..ఎలాంటి సమస్యనైనా..సలహాలు, సూచనలు ట్విట్టర్ ద్వారా తనకు తెలియచేయాలని సూచించారు.

Read More : Train Booking : వారం రోజుల పాటు రైలు రిజర్వేషన్లు బంద్..ఎందుకు ?

బాలల దినోత్సవం సందర్భంగా..15 ఏండ్ల పిల్లలకు ఉచిత ప్రయాణం, పెళ్లిళ్లకు ఆర్టీసీ బుక్ చేసుకుంటే..గిఫ్ట్ లు అందచేస్తున్నారు. ఇలాంటి వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ..ప్రయాణీకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా..ఓ ఆర్టీసీ డ్రైవర్ చేసిన చర్యను ప్రశంసిస్తూ..ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.

Read More : Amit Shah : ఏపీలో 2024 అధికారం దిశగా బీజేపీ – సోము వీర్రాజు

నాగర్ కర్నూలు జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండల పరిధిలో నాయినిపల్లి మైసమ్మ ఆలయం ఉంది. ఈ టెంపుల్ కు ప్రతి ఆదివారం భక్తులు భారీగా తరలివస్తుంటారు. ఈ ఆలయానికి వచ్చేందుకు ఆర్టీసీ బస్సులు నడుపుతోంది. నాగర్ కర్నూలు, కొల్లాపూర్, వనపర్తి డిపోల నుంచి బస్సులు నడుస్తుంటాయి. నాగర్ కర్నూలు కు చెందిన డ్రైవర్ శాంతయ్య ఈ జాతరకు వచ్చే ప్రయాణీకులను ఆకర్షించేందుకు…అద్భుతమైన పాటను పాడారు. మైసమ్మ దేవత ప్రాశస్త్యం తెలుపుతూ..పాటను ఆలపించారు. ఆర్టీసీ బస్సుల్లో సురక్షిత ప్రయాణం చేద్దామని ప్రయాణీకులను డ్రైవర్ శాంతయ్య విజ్ఞప్తి చేశారు.