Fire Accident: ప్రాణాలకు తెగించి తల్లి కూతురిని రక్షించిన కానిస్టేబుల్

మంటల్లో చిక్కుకున్న తల్లీకూతురిని సురక్షితంగా కిందకు తీసుకువచ్చాడు శ్రావణ్ కుమార్. ప్రాణాలకు తెగించి, ధైర్యసాహసాలను ప్రదర్శించిన కానిస్టేబుల్ శ్రావణ్ ను స్థానికులు అభినందించారు

Fire Accident: ప్రాణాలకు తెగించి తల్లి కూతురిని రక్షించిన కానిస్టేబుల్

Fire Acci

Updated On : February 12, 2022 / 5:17 PM IST

Fire Accident: హైదరాబాద్ నగరం నడిబొడ్డున పంజాగుట్టలో శనివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పంజాగుట్టలోని ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్ లో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అపార్ట్మెంట్ నాలుగో ఫ్లోర్ లోని ఫ్లాట్ లో మంటలు చెలరేగడంతో తల్లి కూతురు మంటల్లో చిక్కుకున్నారు. మంటలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇంతలో మంటలు దట్టంగా వ్యాపించడంతో ఫ్లాట్ లో ఉన్న తల్లీకూతురు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సాయం కోసం ఎదురు చూశారు. అదే సమయంలో అక్కడే ఉన్న పంజాగుట్ట ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రావణ్ కుమార్ అప్రమత్తమై..అపార్ట్మెంట్ టెర్రస్ పైకి ఎక్కి.. అక్కడి నుంచి నాలుగో ఫ్లోర్ కి చేరుకున్నాడు.

Also read: Classes Open: యూనివర్సిటీలు, కళాశాలల్లో తరగతులు ప్రారంభించండి: యూజీసీ ఆదేశాలు

అనంతరం మంటల్లో చిక్కుకున్న తల్లీకూతురిని సురక్షితంగా కిందకు తీసుకువచ్చాడు శ్రావణ్ కుమార్. ప్రాణాలకు తెగించి, ధైర్యసాహసాలను ప్రదర్శించిన కానిస్టేబుల్ శ్రావణ్ కుమార్ ను స్థానికులు అభినందించారు. అనంతరం సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను పూర్తిగా అదుపు చేశారు. కాగా రెండు రోజులుగా హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంటున్న అగ్నిప్రమాదాలు నగర వాసులను కలవరపెడుతున్నాయి. శుక్రవారం జూబిలీహిల్స్ పరిధిలోని ఓ వ్యాపార సముదాయం వద్ద జరిగిన అగ్నిప్రమాదంలో మూడు ఖరీదైన కార్లు దగ్ధం కాగా.. ఫిలిం నగర్ లోని మరో అపార్ట్మెంట్ లోనూ స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది.

Also read: Indian NCAP: ఇకపై భారత్ లో వాహనాలకు “స్వదేశీ భద్రతా ప్రమాణాలు”