Rahul Gandhi – Kodandaram : కరీంనగర్ లో రాహుల్ గాంధీ, కోదండరామ్ భేటీ.. పొత్తు, సీట్ల కేటాయింపుపై చర్చ
తెలంగాణ ప్రయోజనాల కోసం, రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరగాలని పేర్కొన్నారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్ బలహీనంగా ఉన్న రెండు, మూడు చోట్లలో సీట్లు అడుగుతామని కోదండరాం తెలిపారు.

Rahul Gandhi - Kodandaram Meeting
Rahul Gandhi – Kodandaram Meeting : కరీంనగర్ లోని వీ పార్క్ హోటల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ భేటీ అయ్యారు. కాంగ్రెస్ తో కలిసి పనిచేయాలని రాహుల్ కోరనున్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలని తెలంగాణ జన సమితి నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ నియంత పాలన దించడానికే టీజేఎస్ ఏర్పడిందని కోదండరాం స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రయోజనాల కోసం, రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరగాలని పేర్కొన్నారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్ బలహీనంగా ఉన్న రెండు, మూడు చోట్లలో సీట్లు అడుగుతామని కోదండరాం తెలిపారు. కాంగ్రెస్ బలహీనంగా ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ముథోల్, ఎల్లారెడ్డి, కోరుట్ల, జహీరాబాద్ స్థానాల్లో ఏవైనా తెలంగాణ జనసమితి ఆశిస్తోంది.
BJP : అభ్యర్థుల ఎంపికపై బీజేపీ ముమ్మర కసరత్తు.. ఆశావహుల్లో కొనసాగుతున్న టెన్షన్