Rahul Gandhi Dance In Bharat Jodo Yatra : జోడో యాత్రలో జోష్ .. గిరిజనులతో కలిసి రాహుల్ డ్యాన్స్

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 50 రోజులు పూర్తి చేసుకుంది.నాలుగు రాష్ట్రాలు..19 జిల్లాల గుండా కొనసాగిన జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతోంది. శనివారం (అక్టోబర్ 29,2022)ఉదయం తెలంగాణలోని మహబూబ్‌ నగర్‌ మండల పరిధిలో ప్రారంభం కాగా..ఈ యాత్రలో రాహుల్ గాంధీ గిరిజనులతో కలిసి వేసిన డ్యాన్సులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భద్రాచలం నుంచి వచ్చిన గిరిజనులతో రాహుల్‌ గిరిజన సంప్రదాయ నృత్యం చేసి ఆకట్టుకున్నారు.

Rahul Gandhi Dance In Bharat Jodo Yatra : జోడో యాత్రలో జోష్ .. గిరిజనులతో కలిసి రాహుల్ డ్యాన్స్

Rahul gandhi Dance In Bharat Jodo Yatra

Updated On : October 29, 2022 / 1:28 PM IST

Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 50 రోజులు పూర్తి చేసుకుంది.నాలుగు రాష్ట్రాలు..19 జిల్లాల గుండా కొనసాగిన జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతోంది. శనివారం (అక్టోబర్ 29,2022)ఉదయం తెలంగాణలోని మహబూబ్‌ నగర్‌ మండల పరిధిలో ప్రారంభం కాగా..ఈ యాత్రలో రాహుల్ గాంధీ గిరిజనులతో కలిసి వేసిన డ్యాన్సులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భద్రాచలం నుంచి వచ్చిన గిరిజనులతో రాహుల్‌ గిరిజన సంప్రదాయ నృత్యం చేసి ఆకట్టుకున్నారు.

రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర శనివారం ఉదయం 6 గంటలకు మహబూబ్‌ నగర్‌ మండల పరిధిలోని ధర్మాపూర్‌లో ఉన్న జయప్రకాశ్‌ ఇంజినీరింగ్‌ కళాశాల నుంచి ప్రారంభమైంది. ఈ యాత్రలో మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం..కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్‌, ఏఐసీసీ సభ్యుడు జైరాం రమేష్‌, రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు భట్టి విక్రమార్క, మధుయాష్కీగౌడ్‌, పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్యే సీతక్క, సంపత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ క్రమంలో గిరిజనులతో కలిసి తన తోటి కాంగ్రెస్ నేతలు సీతక్క, భట్టి విక్రమార్క వంటి నేలతో కలిసి రాహుల్ గాంధీ డ్యాన్సులు వేశారు. రాహుల్ తమతో కలిసి డ్యాన్సులు వేయటంతో గిరిజనులంతా తెగ సంబరపడిపోయారు.ఉత్సాహంగా స్టెప్పులు వేశారు.

 

ఉదయం సమయంలో 15 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. పాదయాత్ర దారిపోడవునా రాహుల్ పలువురితో కలిసి మాట్లాడుతున్నారు. చిన్నారులను భుజాలపై ఎక్కించుకుని నడుస్తున్నారు.చిన్నారులు పెట్టే ముద్దులకు రాహుల్ పరవశించిపోతున్నారు. చిన్నారులను ముద్దు చేస్తున్నారు. రాహుల్ తో పాటు ఎంతోమంది యువత అడుడులు వేస్తున్నారు. రాహుల్ ను పలువురు వృద్ధులు దారిపొడవునా ఆశీర్వదిస్తున్నారు.

యువకులు, చిన్నారులు, మహిళలు, కళాకారులు, వివిధ సంఘాల నేతలు, కార్మికులతో రాహుల్‌ ముచ్చటిస్తున్నారు. తెలంగాణలో కొనసాగుతున్న ఈ యాత్రలో శనివారం సినీనటి పూనమ్‌కౌర్‌ రాహుల్‌తో పాదయాత్రలో పాల్గొన్నారు. భద్రాచలం నుంచి వచ్చిన గిరిజనులు రాహుల్‌తో కలిసి యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్‌ వారితో కలిసి సంప్రదాయ నృత్యం చేసి ఆకట్టుకున్నారు. చేనేత కార్మికులు వారి సమస్యలను రాహుల్‌ దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం విధించిన జీఎస్టీని తొలగించి.. పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో 3వేల మంది విద్యార్థులతో ర్యాలీ చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయానికి చెందిన పలువురు విద్యార్థులు రాహుల్‌ను కలిసి వర్సిటీల సమస్యలపై వివరించారు.