Bhart jodo Yatra In Telangana: భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ, రేవంత్‌ రెడ్డిల పరుగు పందెం.. వీడియో వైరల్

భారత్ జోడో యాత్ర మహబూబ్ నగర్ జిల్లాలో ఉత్సాహంగా సాగుతోంది. రాహుల్ గాంధీ పాదయాత్రలో స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, కార్యకర్తల్లో జోష్ నింపుతూ ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా ఆదివారం పాదయాత్రలో భాగంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.

Bhart jodo Yatra In Telangana: భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ, రేవంత్‌ రెడ్డిల పరుగు పందెం.. వీడియో వైరల్

Bharat Jodo Yatra

Updated On : October 30, 2022 / 10:41 AM IST

Bhart jodo Yatra In Telangana: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం ఐదవ రోజు తెలంగాణలో కొనసాగుతోంది. ఉదయం 6గంటలకు మహబూబ్ నగర్ జిల్లాలోని గొల్లపల్లి నుంచి రాహుల్ పాదయాత్ర మొదలైంది. భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలు రాహుల్ వెంట పాదయాత్రలో పాల్గొన్నారు. స్థానిక ప్రజలకు అభివాదం చేస్తూ, మధ్యమధ్యలో స్థానికుల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుంటూ రాహుల్ గాంధీ పాదయాత్రలో ముందుకు సాగారు.

Bharat Jodo Yatra: తెలంగాణలో 5వ రోజు భారత్ జోడో యాత్ర ప్రారంభం

పాదయాత్రలో భాగంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. రాహుల్ గాంధీ కొద్దిసేపు పరుగు తీశారు. రాహుల్ ను కలిసేందుకు కొద్ది మంది చిన్నారులు వచ్చారు. వారితో ముచ్చటించిన రాహుల్ ఉన్నట్లుండి పరుగు తీయడం మొదలు పెట్టాడు. రాహుల్ ను అనుకరిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరుగెత్తగా కార్యకర్తలుసైతం రాహుల్‌ను అనుకరిస్తూ పరుగెత్తారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.