రాబోయే మూడు రోజుల్లో హైదరాబాద్ లో వర్షాలు
ఉపరితల ద్రోణి ఏర్పడిన నేపథ్యంలో రాగల మూడు రోజులు గ్రేటర్ హైదరాబాద్ లో అకడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.

ఉపరితల ద్రోణి ఏర్పడిన నేపథ్యంలో రాగల మూడు రోజులు గ్రేటర్ హైదరాబాద్ లో అకడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్ లో ఈ వేసవి కాలంలో తొలిసారిగా రికార్డు స్థాయిలో 37.0 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వారం క్రితం 36.2డిగ్రీలు నమోదు కాగా శుక్రవారం (మార్చి 27, 2020) 37డిగ్రీలు నమోదుకావడంతో పగలు ఎండలు దంచికొట్టాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం సాధారణ స్థాయిని దాటి 22.9డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 34శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
ఉపరితల ద్రోణి ఏర్పడిన నేపథ్యంలో రాగల మూడు రోజులు గ్రేటర్ హైదరాబాద్ లో అకడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. ఈనెల 29, 30 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలిన సూచించారు. సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని తెలిపారు.
ఇప్పటికే కరోనా కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు నగరవాసులు అందరూ ఇంటికే పరిమితం అయ్యారు. ఎవరూ బయటికి రావడం లేదు. రోడ్లన్ని నిర్మానుష్యంగా మారాయి. స్వీయ గృహనిర్బంధం పాటిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావడం లేదు.
Also Read | ఏపీలో మరో ఇద్దరికి కరోనా…రాష్ట్రంలో 13కి పెరిగిన కేసులు